ఏపీ జీవనాడి మరెంతో దూరం లేదు.. నిర్వాసితు జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలుః చంద్రబాబు
పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది లేదు.. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప. నిర్వాసితులకు భయం లేదు. పునరావాసాలు పక్కా అంటున్నారు ఏపీ సీఎం.

పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది లేదు.. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప. నిర్వాసితులకు భయం లేదు. పునరావాసాలు పక్కా అంటున్నారు సీఎం. గోదారి ఒడ్డున సాకారం కాబోతున్న ఏపీ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఇచ్చిన కీలక అప్‌డేట్స్ ఏంటి..? ఇంతకూ పోలవరం ఎంతదూరంలో ఉంది..? తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్ మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి.. 2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు చంద్రబాబు. గురువారం(మార్చి 27) పోలవం ప్రాజెక్ట్‌ను సందర్శించిన చంద్రబాబు.. ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు హెలిప్యాడ్ సైట్ వద్ద పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాలతోనే పోలవరం ఆలస్యానికి కారణమని, రాజకీయ కక్షతో ప్రజల ప్రాజెక్ట్‌ను అటకెక్కించారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిందన్నారు. ఇప్పుడు మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు.
అనంతరం పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారని, 2026 నాటికి నిర్వాసితులకు పునరావాసాలు పూర్తి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రాజెక్టుకి భూములిచ్చిన రైతులకు మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని, నిన్నమొన్నటి వరకూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు.
2014లో తాము అధికారంలోకి రాక ముందు నిర్వాసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రూ.4,311 కోట్ల పరిహారం చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఆప్పటి ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా నిర్వాసితుల గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదని విమర్శించారు. కనీసం వారి సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవన్నారు. పునరావాసం కల్పించిన తర్వాత నిర్వాసితుల ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామి ఇచ్చారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..