Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు.. కేసులోని సెక్షన్లు ఇవే

మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.

  • Ram Naramaneni
  • Publish Date - 11:40 am, Thu, 15 April 21
Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు.. కేసులోని సెక్షన్లు ఇవే
Devinei Uma

మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అసలు ఏం జరిగిందంటే…

సీఎం జగన్  వీడియోను మార్ఫ్ చేశారంటూ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 464, 465, 468, 471, 505 కింద దేవినేని ఉమాపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నెల 7న ఉమ ట్వీట్ చేసిన ఓ వీడియో దుమారం రేపింది. అందులో మాటలు ముఖ్యమంత్రి జగన్ తిరుపతిని కించపరిచే ఉన్నాయి. ఎవరైనా గొప్పవాళ్ళు తిరుపతికి రావటానికి ఇష్టపడరు అంటూ తిరుపతిని ఒడిశా, బీహార్‌తో కంపార్ చేశారు. ఈ వీడియో నకిలీది అంటూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలిందని సీఐడీకి ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు అయ్యింది.

తనపై కేసు నమోదు కావడంపై ఇటీవల దేవినేని ఉమ స్పందించారు. ప్రభుత్వ అరాచకాలను, దుర్మార్గ పాలనను ప్రశ్నించే గొంతులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిపై జగన్‌ అంతరంగాన్ని బయటపెడితే తనపై సీఐడీ కేసు నమోదు చేస్తుందా అంటూ ఫైరయ్యారు. ఇలాంటి కేసులకు భయపడనని..ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటామన్నారు. చట్టం, న్యాయ పుస్తకాలు వీడియో మార్ఫింగ్‌ లేదని చెబుతున్నాయని పేర్కొన్నారు.

Also Read: హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు.. వారివి సివిల్‌ పోస్టులే అని స్పష్టం

పొట్టు, పొట్టు కొట్టుకున్న ఇద్దరు పోలీసులు.. రీజన్ ఎంత సిల్లీనో తెలుసా..?