AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet: లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్న ఏపీ సీఎం.. ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా!

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా రెండు నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం స్మార్ట్ గవర్నెన్స్ పై దృష్టి కేంద్రీకరించింది. పాలనలో కూడా లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవ్వాలని ఆలోచిస్తోంది. లెస్ గవర్నెన్స్.. మోర్ గవర్నమెంట్ పాలసీ తో ముందుకు వెళుతున్న ప్రభుత్వం తాజాగా మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది.

AP Cabinet: లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతున్న ఏపీ సీఎం.. ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా!
Chandrababu Cabinet
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 17, 2024 | 9:10 AM

Share

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా రెండు నెలల క్రితం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం స్మార్ట్ గవర్నెన్స్ పై దృష్టి కేంద్రీకరించింది. పాలనలో కూడా లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవ్వాలని ఆలోచిస్తోంది. లెస్ గవర్నెన్స్.. మోర్ గవర్నమెంట్ పాలసీ తో ముందుకు వెళుతున్న ప్రభుత్వం తాజాగా మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో అమలు చేసిన విధానాన్ని మళ్లీ తాజాగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఒక సర్కులర్ కూడా జారీ చేసింది.

అదే పేపర్ లెస్ కేబినెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆగస్ట్ 27వ తేదీన నిర్వహించ తలపెట్టిన కేబినెట్ మీటింగ్‌లో ఎలాంటి పేపర్ మనకు కనిపించదని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేపర్ కు బదులు ఐప్యాడ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై కేబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి గత కేబినెట్‌ భేటీలోనే తన మంత్రి వర్గ సహచరులకు హింట్ ఇచ్చారు.

గతం లోనూ మంత్రులకు ట్యాబ్‌లు

సాధారణంగా కేబినెట్ అజెండాతోపాటు టేబుల్ ఎజెండా కానీ ఇతర కీలకమైన సమాచారాన్ని మంత్రులకు హార్డ్ కాపీల రూపంలోనే ఇస్తుంటారు. దీంతో భారీగానే వాటి వినియోగం ఉంటుంది. అదే సమయంలో వాటి కాలపరిమితి కూడా తక్కువగా ఉంటుంది. ట్యాబులు అలవాటు చేయడం ద్వారా సమాచారం తోపాటు సెర్చ్ ఇంజిన్ల ద్వారా అదనపు సమాచారాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. 2017లోనే అప్పడు సీఎంగా ఉన్న చంద్రబాబు పేపర్ లెస్ కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు.

ఈ – కేబినెట్ లెక్క..

మంత్రులందరూ ఫిజికల్‌గా హాజరవుతారు కానీ పేపర్ వినియోగం మాత్రం ఉండదు. అజెండా అంశాల ఆధారంగా ప్రతి కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం 40 సెట్ల నోట్స్ ముద్రించాల్సి ఉంటుంది. గతంలో హార్డ్ కాపీల రూపంలో ఇచ్చే ఆ నోట్స్ అన్ని ఇకపై సాఫ్ట్ కాపీల రూపంలో మినిస్టర్స్‌కు, సంబంధిత అధికారులందరికీ ప్రభుత్వం అందజేయనుంది. అలాగే లీకేజ్‌కు ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఈ – కేబినెట్ వల్ల ప్రింటింగ్ చార్జీలు ఆదా కావడమే కాకుండా సమాచారం బయటకు పొక్కకుండా నియంత్రణ సాధ్యమవుతుందని సచివాలయం వర్గాలు తెలుపుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..