BJP: అవినీతి కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదు.. టీడీపీ, వైసీపీలపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ కామెంట్..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Aug 30, 2022 | 7:35 AM

టీడీపీ, వైసీపీ పార్టీలతో బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎటువంటి పొత్తు ఉండదన్నారు సునీల్‌ దియోదర్‌. ప్రధాని మోదీతో సీఎం జగన్మోహన్ రెడ్డి..

BJP: అవినీతి కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదు.. టీడీపీ, వైసీపీలపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ కామెంట్..
Sunil Deodhar

టీడీపీ(TDP), వైసీపీ(YCP)లతో పొత్తు వ్యవహారంపై ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్(Sunil Deodhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట పై నుంచి ఆగష్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించిన విధంగా దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న అవినీతి కుటుంబ పార్టీలకు ప్రతి రూపమైన టీడీపీ, వైసీపీ పార్టీలతో బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎటువంటి పొత్తు ఉండదన్నారు సునీల్‌ దియోదర్‌. ప్రధాని మోదీతో సీఎం జగన్మోహన్ రెడ్డి కలుస్తుండటం.. మీ రెండు పార్టీలో ఒక్కటే అనటం సరికాదని అన్నారు. దుర్యోధనుడు కలిసేందుకు శ్రీ కృష్ణుడి చాలా సార్లు సమయం ఇచ్చాడు. చాలా సార్లు కలిశాడు.

అలా అని కృష్ణుడు ధర్మం వైపే నిలుచున్నాడని అన్నారు. జనసేన మా మిత్ర పక్షం.. మా పొత్తు కొనసాగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ విధి విధానాలను బిజెపి పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది కాని వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్న రచయితలు కాదన్నారు. దుష్ట పార్టీలైన టీడీపీ-వైసీపీతో పోరాడి 2024లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశ , మార్గం రెండూ స్పష్టంగా తమకుయన్నారు.

వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది. ఏపీ ప్రభుత్వంతో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్‌ కామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలో సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని సోము వీర్రాజు అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu