BJP: అంతా ఆయన వల్లే ఇలా.. పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..

రాజకీయాల్లో కురు వృద్ధుడు.. గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తి తన సొంత పార్టీ అధ్యక్షుడిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

BJP: అంతా ఆయన వల్లే ఇలా.. పవన్ కల్యాణ్ కామెంట్స్‌పై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు..
AP POLITICAL NEWS
Follow us

|

Updated on: Oct 19, 2022 | 4:10 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇప్పుడు మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే  బీజేపీపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌ ఆపార్టీలో పెద్ద చర్చను క్రియేట్ చేస్తోంది. విశాఖలో జరిగిన పరిణామాలతో పాటు మంగళగిరిలో పవన్ కల్యాణ్, ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీతో రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా బలంగా పనిచేయలేకపోయామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదే సమయంలో తనకు బీజేపీ నుంచి సరైన మద్ధతు లభించడం లేదని, రోడ్ మ్యాప్ అడిగినా పట్టించుకోవడం లేదంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బీజేపీలో ప్రకంపనలు సృష్టించింది. ఇదే అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును పార్టీలోని కొందరు టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏపీలో పార్టీ బలోపేతానికి అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్‌తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని.. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ మండిపడ్డారు. సోము వీర్రాజు ఒక్కడే అన్నింటిని చూసుకోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని.. పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా అస్సలు తెలియడం లేదని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

అయితే బుధవారం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినా బలంగా పనిచేయలేకపోయామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రధాని మోదీ అన్నా, బీజేపీ అన్నా తనకు గౌరవం ఉందని అలాగని తన స్థాయిని తగ్గించుకోలేనని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ ముఖాచిత్రం మారబోతుంది. బీజేపీని రోడ్డు మ్యాప్ అడుగడమేమిటని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. రౌడీలు రాజ్యాన్ని పాలిస్తుంటే.. నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యుహాన్ని కూడా మార్చుకున్నాను. అంతా మాత్రాన నేను ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కలుస్తాం.. ముందుకు తీసుకెళ్తాం.. కానీ ఊడిగం మాత్రం చేయమని పవన్ కల్యాణ్ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం