AP Budget 2024 Live: అంబేడ్కర్ ఆశయాలే ఆదర్శం.. సీఎం జగన్‌ది చాణక్యుడి తరహా పాలన..

Ravi Kiran

|

Updated on: May 08, 2024 | 10:10 PM

Andhra Pradesh Budget 2024 session Live Updates: ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ ఇది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 లక్షల 86 వేల కోట్ల అంచనాలతో బడ్జెట్‌‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

AP Budget 2024 Live: అంబేడ్కర్ ఆశయాలే ఆదర్శం.. సీఎం జగన్‌ది చాణక్యుడి తరహా పాలన..
Ap Budget

ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ ఇది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 లక్షల 85 వేల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను 11 గంటల 3 నిమిషాలకు సభలో ప్రవేశపెడతారు. మండలిలో IT, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అటు సచివాలయంలోని తన కార్యాలయంలో బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు మంత్రి బుగ్గన. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి SS రావత్, సత్యనారాయణ కూడా అక్కడే ఉన్నారు. అంతకుముందు విజయవాడ దుర్గమ్మ సన్నిధిలోనూ ఆర్థిక శాఖ అధికారులు పూజలు చేశారు. ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ భేటి జరిగింది. ఈ సమావేశంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌కు ఆమోదముద్ర వేసింది రాష్ట్ర కేబినేట్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో.. ఎలా ఉండబోతోందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Feb 2024 01:30 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 117 అవగాహనా ఒప్పందాలు

    రూ. 19,345 కోట్ల పెట్టుబడులతో, 3,685 మందికి ఉపాధి

    38 లక్షల మంది క్రీడాకారులతో ఐదు అంచెలుగా ఆడుదాం ఆంధ్రా

    క్రీడల్లో మౌలిక సదుపాయాల కోసం 41 క్రీడా వికాస కేంద్రాలు

    32 న్యాయ భవనాలు పూర్తి, 13 న్యాయభవనాల నిర్మాణంలో పురోగతి

  • 07 Feb 2024 01:25 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    వివాద రహిత భూమే ఆశయంగా భూభద్ర ఆంధ్ర

    జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకాలు ప్రారంభించాం

    17.53 లక్షల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలు

    4.80 లక్షల మ్యూటేషన్లకు పరిష్కారం సాధ్యమైంది..

  • 07 Feb 2024 01:20 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    గత ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం…

    దాదాపు 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ

    ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంపు

  • 07 Feb 2024 01:16 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    రైతులందరికీ ఉచిత పంటల బీమా అమలుచేసే ఏకైక రాష్ట్రం ఏపీ

    స్థూల ఉత్పత్తి రేటులో 14వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకున్న ఏపీ

    సులభతర వాణిజ్యంలో ఆగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

  • 07 Feb 2024 01:15 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    ఎస్‌సీలకు ఉచిత గృహ విద్యుత్ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంచాం..

    పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 883.5 కోట్ల సాయం

    2019 నుంచి 66.35 లక్షల మందికి రూ. 84,731 కోట్ల పెన్షన్ కానుక

    రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518. దేశంలోకెల్లా 9వ ర్యాంక్

    లక్షా 53 వేల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాల పంపిణీ

    జగనన్న కాలనీల్లో 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం

    మాది పేదరికంపై యుద్ధం.. వాళ్లది దోమలపై దండయాత్ర

    సంపద పెంచడం కాదు.. పెంచిన సంపదను పేదలకు ఎంత పంచాం అన్నది ముఖ్యం

  • 07 Feb 2024 12:47 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    2019 నుంచి 65 కొత్త ఐటీ కంపెనీలు, 47,908 మందికి ఉపాధి

    గత ఐదేళ్లలో 311 భారీ పరిశ్రమలు. 1.30 లక్షల మందికి ఉపాధి

    రూ. 10,137 కోట్ల ఖర్చుతో తొమ్మిది తాగునీటి పథకాలు

    ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తికి కట్టుబడి ఉన్నాం

    ఐదేళ్లలో రూ. 2,626 కోట్లతో రాష్ట్ర రహదారుల అభివృద్ధి

  • 07 Feb 2024 12:45 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    నాణ్యమైన వైద్యం కోసం 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది

    21 రంగాలలో 1.06 లక్షల మందికి శిక్షణ, 95 శాతం మందికి ఉద్యోగావకాశాలు

    విదేశీ ఉన్నత విద్యా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం

    ఉన్నత విద్యలో 6.62 శాతానికి తగ్గిన డ్రాపౌట్ శాతం

  • 07 Feb 2024 12:35 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    19 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లకు 9 గంటల ఉచిత విద్యుత్

    73.88 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీకే పంట రుణాలు

    10,778 రైతు భరోసా కేంద్రాలతో రైతు ఇంటివద్దకే సేవలు

    రైతుల ఆదాయం పెరిగేలా సమగ్ర వ్యూహం రూపొందించాం

    రైతు భరోసా కింద 1.6 లక్షలమంది కౌలు రైతులకు లబ్ది

  • 07 Feb 2024 12:32 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    గతంలో కంటే భిన్నంగా సాగింది ఏపీ మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన మంత్రి.. వివిధ శాఖలకు కేటాయించిన నిధుల వివరాలను సభ ముందుంచారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలతో అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపామన్నారు బుగ్గన.

  • 07 Feb 2024 12:30 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    ప్రభుత్వ పథకాలతో సంపూర్ణ మహిళా సాధికారత సాధించాం..

    మహిళా సాధికారతకు రుజువులు చూపించిన మంత్రి బుగ్గన

    కోటి దాటిన దిశ మొబైల్ యాప్‌ డౌన్‌లోడ్‌లు

    ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వాములను చేశాం

    43.61 లక్షల మంది మహిళలకు అమ్మఒడి కింద రూ. 26,067 కోట్లు

  • 07 Feb 2024 12:30 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    రూ. 20 వేల కోట్లతో నాలుగు పర్యావరణ ఓడరేవులు

    రూ. 3,800 కోట్ల ఖర్చుతో 10 ఫిష్షింగ్ హార్బర్లు

    4.5 లక్షల చేపలు, రొయ్య వేట ద్వారా లక్షమందికి ఉపాధి

    భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పనులు ప్రారంభించాం

    ఆరు విమానాశ్రయాల పునరుద్ధరణ, కర్నూల్‌లో విమానసర్వీసులు ప్రారంభం

  • 07 Feb 2024 12:15 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    నాడు-నేడు కింద 56,703 వసతులు మెరుగుపరిచాం

    జగనన్న గోరుముద్ద కింద 43 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్

    ఈ పథకానికి ఏడాదికి రూ. 1910 కోట్లు ఖర్చు

    గత ప్రభుత్వాని కంటే నాలుగు రెట్లు అధికంగా ఖర్చు

    ఫ్యామిలీ డాక్టర్ సేవల్లో భాగంగా మండలానికో 108, 104 సర్వీసులు

    వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం

  • 07 Feb 2024 12:00 PM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    రక్తస్రావంతో బాధపడే గర్భిణీల సంఖ్య గతంలో కంటే తగ్గింది

    పోషకాహారం కోసం గత ప్రభుత్వం కంటే 4 రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాం

    99.81 శాతం పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించాం

    ఏటా 47 లక్షల మందికి ప్రీ-స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నాం

  • 07 Feb 2024 11:45 AM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    విద్యాప్రమాణాల మెరుగు కోసం 9,52,927 ట్యాబ్‌ల పంపిణీ

    వెయ్యి స్కూళ్లలో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు సీబీఎస్‌ఐ సిలబస్

    ప్రతీ ఒక్క విద్యార్థికీ టోఫెల్ ధృవీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు

    మానవ మూల ధన అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత

    పరిపూర్ణ మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా సామర్థ్య ఆంధ్ర

    ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం

    కుప్పం సహా కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు

    లక్షా 35 వేల మంది ఉద్యోగులతో గ్రామ సచివాలయాల ఏర్పాటు

    రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకూ పాలన

  • 07 Feb 2024 11:30 AM (IST)

    బడ్జెట్ డీటయిల్స్ ఇవే..

    రూ.2,86,389.27 కోట్లతో ఏపీ బడ్జెట్‌

    ఆదాయ వ్యయం రూ.2,30,110.41 కోట్లు

    మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు

    రెవెన్యూ లోటు రూ.24,758.22 కోట్లు

    ద్రవ్య లోటు రూ.55,817.50 కోట్లు

    జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం

    రెవెన్యూ లోటు 1.56 శాతం

  • 07 Feb 2024 11:23 AM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్

    తొలిమూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ పద్దుకు క్యాబినెట్ ఆమోదం

    బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్- బుగ్గన

    బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత- బుగ్గన

    ఐదేళ్ల కిందటి తన మొదటి బడ్జెట్‌ ప్రసంగాన్ని గుర్తు చేసుకున్న బుగ్గన

    సీఎం జగన్ బడ్జెట్‌ను పవిత్ర గ్రంథంతో పోల్చారు- బుగ్గన

    ఏ బలహీన వర్గాన్నీ విస్మరించవద్దన్న వైఎస్ స్పూర్తితోనే బడ్జెట్

    అంబేద్కర్ ఆశయాలే మా ప్రభుత్వానికి ఆదర్శం- బుగ్గన

    సీఎం జగన్… చాణుక్యుడి తరహా పాలన అందిస్తున్నారు-బుగ్గన

  • 07 Feb 2024 11:21 AM (IST)

    బడ్జెట్ బ్రేకింగ్స్..

    • కుప్పం సహా కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
    • లక్షా 35 వేల మంది ఉద్యోగులతో గ్రామ సచివాలయాల ఏర్పాటు
    • రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకూ పాలన
  • 07 Feb 2024 11:10 AM (IST)

    అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం..

    ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి.

  • 07 Feb 2024 10:45 AM (IST)

    కొనసాగుతున్న అసెంబ్లీ..

    ఏపీ పబ్లిక్ సర్వీసెస్ సవరణ బిల్లు,ఆర్జీయూకేటీ సవరణ బిల్లు,అసైన్డ్ ల్యాండ్స్ బదిలీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

  • 07 Feb 2024 10:00 AM (IST)

    సభలో టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు

    అంతకుముందు.. ఫ్లెక్సీలు, ప్లకార్డులతో అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.

  • 07 Feb 2024 09:45 AM (IST)

    9 గంటలకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ..

    వాయిదా తీర్మానాల కోసం టీడీపీ పట్టు..

    సభ ప్రారంభం కాగానే.. సాగునీటి ప్రాజెక్టుల్లో జాప్యంపై, రైతాంగానికి జరిగిన నష్టంపై వాయిదా తీర్మానాలు ఇచ్చింది ప్రతిపక్ష తెలుగుదేశం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాక, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుబట్టింది టీడీపీ. కానీ.. వాయిదా తీర్మానాల్ని తోసిపుచ్చి సభాకార్యకలాపాలను యధావిధిగా కొనసాగించారు స్పీకర్ తమ్మినేని.

  • 07 Feb 2024 09:30 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్..

    ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్..

    చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు మంత్రి బుగ్గన. సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అని కొనియాడారు. జగన్ విధానాలు ఎన్నో రాజకీయ పార్టీలకు బెంచ్ మార్క్ అయ్యాయని ప్రశంసించారు. అట్టడుగున ఉండే బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. విద్య, వైద్యం, మహిళ సాధికారిత, వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విభజన హామీలు చాలావరకు ఎన్నో సాధించుకొగలిగాం. కచ్చితంగా సంక్షేమానికే పెద్ద పీట ఉంటుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.

  • 07 Feb 2024 09:12 AM (IST)

    ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..

    ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. మంత్రి బుగ్గన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అసెంబ్లీలో ఉదయం 11.03 గంటలకు బుగ్గన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇప్పటికే బడ్జెట్‌కు రాష్ట్ర కేబినేట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

Published On - Feb 07,2024 9:10 AM

Follow us