AP Rains: పగబట్టిన వరుణుడు.. ఏపీకి వచ్చే 24 గంటల్లో మరో ప్రమాదం.?
మరో మెరుపు దాడికి మేఘాలు సిద్ధమయ్యాయా...? తెలుగు రాష్ట్రాలపై వరుణుడి కోసం ఇంకా తగ్గలేదా...? అంటే అవుననే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. వణికిపోయే వెదర్ రిపోర్ట్ ఇచ్చారు.
మేఘాలు చేస్తున్న మెరుపు దాడికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్‌టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. ఎన్నడూ లేనంత వర్షపాతం ఈసారి నమోదైంది. ఎటు చూసినా వరద, బురదే కనిపిస్తోంది. ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. మొత్తంగా వరద బాధితుల ఆవేదన వర్ణనాతీతం. ఈ టైమ్‌లో మరో పిడుగులాంటి వార్త. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసే వార్త చెప్పింది వాతావరణశాఖ. ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాల కురుస్తాయంటున్నారు అధికారులు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాబోవు మూడు నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. మొత్తంగా వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి.