Railway Tracks: కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌లు.. 150కి పైగా రైళ్లు రద్దు.!

Railway Tracks: కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌లు.. 150కి పైగా రైళ్లు రద్దు.!

Anil kumar poka

|

Updated on: Sep 04, 2024 | 9:39 AM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీవినీ ఎరగని స్థాయిలో జిల్లాలకు జిల్లాలు నీట మునిగాయి. రైలు రవాణా స్థంభించిపోయింది. వరంగల్‌ జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కేసముద్రంలో రైల్వే ట్రాక్‌ కింద దిమ్మెలన్నీ కొట్టుకుపోయి ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది. ఈ మార్గంలో రెండు వైపులా ట్రాక్‌ దెబ్బతింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీవినీ ఎరగని స్థాయిలో జిల్లాలకు జిల్లాలు నీట మునిగాయి. రైలు రవాణా స్థంభించిపోయింది. వరంగల్‌ జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కేసముద్రంలో రైల్వే ట్రాక్‌ కింద దిమ్మెలన్నీ కొట్టుకుపోయి ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది. ఈ మార్గంలో రెండు వైపులా ట్రాక్‌ దెబ్బతింది. ట్రాక్‌ కొట్టుకుపోయిన ప్రాంతంలో దానికి కొద్దిదూరంలో భారీ గూడ్స్‌ ట్రైన్‌ నిలిచిపోయింది. ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద JCBల సాయంతో అక్కడ మట్టి నింపే జరుగుతోంది. అటు విజయవాడ శివారు రాయనపాడులోనూ ట్రాక్‌ దెబ్బతింది. దీంతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి, అటు నుంచి ఇటు వచ్చే అనేక రైళ్ల దారి మళ్లించారు.

తెలుగు రాష్ట్రాల పరిధిలో నడిచే 150కి పైగా రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. రైళ్లు రద్దవడంతో దూరప్రాంతాలకు వెళ్తూ మార్గమధ్యలో ఇరుకున్నవారు అష్ట కష్టాలు పడుతున్నారు. బస్టాండ్లు కూడా ప్రయాణికులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. చాలా రైలు సర్వీసులపై వర్షాల ప్రభావం పడడంతో ట్రాక్‌లు దెబ్బతిన్న చోట మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్‌ కేసముద్రం దగ్గర ట్రాక్‌ తిరిగి అందుబాటులోకి వస్తే.. వరంగల్‌-విజయవాడ రూట్‌ తిరిగి అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.