High Alert For AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి వర్షాలే వర్షాలు
విజయవాడ విలవిల లాడుతోంది.వరద ఉధృతి తగ్గినా .. ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ నగరం. నాలుగు రోజులుగా నగర ప్రజలు జలదిగ్బంధంలో అల్లాడుతున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకొని వేల మంది ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారు. నాలుగు రోజులు గుడుస్తున్నా ఇంకా వరద బాధితుల ఆకలికేకలు, ఆక్రందనలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నా ఇంకా చాలా మందికి ఆహారం, మంచినీళ్లు అందని పరిస్థితి కనిపిస్తోంది.
విజయవాడ విలవిల లాడుతోంది.వరద ఉధృతి తగ్గినా .. ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ నగరం. నాలుగు రోజులుగా నగర ప్రజలు జలదిగ్బంధంలో అల్లాడుతున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకొని వేల మంది ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారు. నాలుగు రోజులు గుడుస్తున్నా ఇంకా వరద బాధితుల ఆకలికేకలు, ఆక్రందనలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్నా ఇంకా చాలా మందికి ఆహారం, మంచినీళ్లు అందని పరిస్థితి కనిపిస్తోంది. వరద బాధితులను కాపాడేందుకు NDRF, SDRF బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవాళ కూడా పెద్దఎత్తున ఆహారం, మంచినీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలోని సహాయక చర్యలు కొనసాగుతున్నా.. అనేక కాలనీల్లో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ.. విజయవాడలో వరద నీళ్లు తగ్గేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ కూడా కృష్ణా జిల్లాల్లోని పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.