Plane Crashed: ఇంటిపై కూలిన విమానం.. అమెరికాలో దారుణ ఘటన.!
టేకాఫ్ అయిన కాసేపటికే ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటన అమెరికాలోని ఫెయివ్యూ సిటీలో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫెయిప్యూ సిటీలోని టౌన్ హౌస్ ప్రాంతంలో సెస్నా 421సీ విమానం ఇళ్లపై కూలిపోయింది. విద్యుత్ లైన్‌లను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.
టేకాఫ్ అయిన కాసేపటికే ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటన అమెరికాలోని ఫెయివ్యూ సిటీలో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫెయిప్యూ సిటీలోని టౌన్ హౌస్ ప్రాంతంలో సెస్నా 421సీ విమానం ఇళ్లపై కూలిపోయింది. విద్యుత్ లైన్‌లను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది.. విమానం ఎందుకు కూలిపోయిందనే వివరాలు తెలియరాలేదు. పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదని స్థానిక ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

