Russia Helicopter: ఆ హెలికాప్టర్‌ కథ విషాదాంతం.. 22 మంది చనిపోయినట్లే.!

Russia Helicopter: ఆ హెలికాప్టర్‌ కథ విషాదాంతం.. 22 మంది చనిపోయినట్లే.!

Anil kumar poka

|

Updated on: Sep 04, 2024 | 7:46 AM

రష్యా తూర్పు ప్రాంతంలో 22 మందితో ప్రయాణిస్తూ.. అదృశ్యమైన హెలికాప్టర్‌ కథ విషాదాంతమైంది. అది కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు. అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

రష్యా తూర్పు ప్రాంతంలో 22 మందితో ప్రయాణిస్తూ.. అదృశ్యమైన హెలికాప్టర్‌ కథ విషాదాంతమైంది. అది కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతానికి సమీపంలో 900 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో హెలికాప్టర్‌ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు. అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్‌.. ముగ్గురు సిబ్బంది, 19 ప్రయాణికులతో కమ్‌చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్‌ అగ్ని పర్వతం సమీపం నుంచి బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. వచ్కజెట్స్‌ సమీపంలో రాడార్‌ నుంచి మాయమైంది. ఈ క్రమంలోనే గాలింపు చర్యల కోసం సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. తాజాగా కూలిపోయిన హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ డబుల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ను 1960ల్లో రూపొందించారు. దీన్ని రష్యాతోపాటు చుట్టు పక్కల దేశాల్లో అత్యధికంగా వినియోగిస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టులో కూడా కమ్‌చత్కాలో ఇటువంటి హెలికాప్టరే 16 మంది ప్రయాణికులతో కుప్పకూలిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.