Indigo Flight: విమానంలో టాయ్‌లెట్‌కు వెళ్లిన వ్యక్తి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.!

ఇండిగో విమానంలో ఓ వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లాడు. అక్కడ అతనికి ఓ లేఖ కనిపించింది. వెంటనే భయంతో బయటకు వచ్చిన అతను విమాన సిబ్బందికి విషయం చెప్పాడు. అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారమిచ్చి విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది.

Indigo Flight: విమానంలో టాయ్‌లెట్‌కు వెళ్లిన వ్యక్తి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.!

|

Updated on: Sep 04, 2024 | 7:07 AM

ఇండిగో విమానంలో ఓ వ్యక్తి టాయిలెట్‌కు వెళ్లాడు. అక్కడ అతనికి ఓ లేఖ కనిపించింది. వెంటనే భయంతో బయటకు వచ్చిన అతను విమాన సిబ్బందికి విషయం చెప్పాడు. అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారమిచ్చి విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానం టాయిలెట్‌లో బెదిరింపు లేఖ కన్పించింది. ఆదివారం ఉదయం 7.55 గంటలకు ఇండిగో విమానం జబల్‌పుర్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. దాదాపు 9 గంటల ప్రాంతంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లోకి వెళ్లగా కమోడ్‌ సీటుపై ఓ పేపర్‌ కన్పించింది. దానిపై ‘బ్లాస్ట్‌’ అని రాసి ఉండటంతో వెంటనే సిబ్బందికి చెప్పారు. అప్రమత్తమైన పైలట్, విమాన సిబ్బంది ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారమిచ్చారు. అనంతరం విమానాన్ని నాగ్‌పుర్‌కు మళ్లించారు. ఉదయం 9.20 గంటలకు విమానం నాగ్‌పుర్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ సిబ్బంది, అంబులెన్స్‌లను విమానాశ్రయంలో సిద్ధంగా ఉంచారు. ప్రయాణికులను దించి వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. విమానంలో 69 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను బస్సులో హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us