AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP MLA Roja: ఆయనకు చిన్న మెదడు చితికిపోయింది.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్..

YCP MLA Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయిందని

YCP MLA Roja: ఆయనకు చిన్న మెదడు చితికిపోయింది.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్..
MLA Roja (File Photo)
Shiva Prajapati
|

Updated on: Nov 04, 2021 | 10:09 PM

Share

YCP MLA Roja: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయనపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు చిన్న మెదడు చితికిపోయిందని వ్యాఖ్యానించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు ప్రవర్తన చూస్తే పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలని అందరూ నిర్ణయించుకునేలా తయారైందని అన్నారు. నరకాసురుణ్ణి వధించినట్లు.. ప్రజలే ఈ నారాశురున్ని లోకల్ బాడీ ఎలక్షన్‌లోనే వధించారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ పాలనకు పట్టం కట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తన కొడుకును మంత్రిని చేసుకుని తనకున్న ఆశను నెరవేర్చుకున్నారు తప్ప.. రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరమే లేదన్నారు. బద్వేల్‌లో బీజేపీకి ఏజెంట్లను సరఫరా చేసింది చంద్రబాబు కాదా? ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు జగన్ స్వీప్ చేశారని అన్నారు. ఇక జగన్‌తో తేల్చుకునేందుకు చంద్రబాబు ఏమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేలు కార్యకర్తల్లా పనిచేస్తున్నారని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఇకనైనా ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని హితవు చెప్పారు. చంద్రబాబు ప్రస్టేషన్ పీక్స్ కి చేరుకుందని, రాష్ట్రాన్ని పూర్తిగా వదిలి వెళ్లిపోతే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు.

Also read:

T20 World Cup 2021, IND vs SCO: వంద శాతం ప్రయత్నిస్తాం.. కోహ్లీసేనను ఓడిస్తాం: స్కాంట్లాండ్ సారథి

Eggs Farming: కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా? ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..

America Diwali: హౌట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు జో బైడెన్‌