Bullet train: తెలుగు ప్రజలకు శుభవార్త.. తొలి బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేది అక్కడే..

ఇదిలా ఉంటే దేశంలో మరో బుల్లెట్ ట్రైన్‌కు మార్గం సుగుమమం అవుతోంది. కొత్తగా ప్రాతిపాదిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సైతం బుల్లెట్ ట్రైన్‌ అందుబాటులోకి రానుంది. ఇంతకీ దేశంలో మొదలు కానున్న రెండో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్ ఏంటి.? ఏయే పట్టణాల మధ్య ఇది అందుబాటులోకి రానుంది.?

Bullet train: తెలుగు ప్రజలకు శుభవార్త.. తొలి బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేది అక్కడే..
Representative image
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 18, 2024 | 6:17 PM

దేశంలో బుల్లెట్ ట్రైన్‌ ప్రారంభం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ముంబయి – అహ్మదాబాద్‌ల నడుమ తొలి బుల్లెట్ ట్రైన్‌ ట్రాక్‌ నిర్మాణం జరుగుతోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లోనే ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెట్టనుంది. అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత భారీ బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

ఇదిలా ఉంటే దేశంలో మరో బుల్లెట్ ట్రైన్‌కు మార్గం సుగుమమం అవుతోంది. కొత్తగా ప్రాతిపాదిస్తున్న ఈ బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సైతం బుల్లెట్ ట్రైన్‌ అందుబాటులోకి రానుంది. ఇంతకీ దేశంలో మొదలు కానున్న రెండో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్ ఏంటి.? ఏయే పట్టణాల మధ్య ఇది అందుబాటులోకి రానుంది.? ఏపీలోని ఏ ప్రాంతం గుండా బుల్లెట్ ట్రైన్‌ పరుగులు పెట్టనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

త్వరలోనే చెన్నై నుంచి కర్ణాకటలోకి మైసూర్‌ వరకు బుల్లెట్‌ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు రాష్ట్రాలను కలుపుతూ 435 కిలోమీటర్ల ట్రాక్‌ వేయనున్నారు. ఇందులో భాగంగా ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మీదుగా వెళ్లనుంది. గుడిపాల మండంల రామాపురం వద్ద స్టాప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రైల్వే ట్రాక్‌ తమిళనాడు, ఆంధప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ 340 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రాక్‌ వేయనున్నారు.

చెన్నై, మైసూర్ బుల్లెట్ ట్రైన్ మ్యాప్..

ప్రస్తుతం చెన్నై నుంచి మైసూరుకు రైలులో ప్రయాణ సమయం సుమారు 10 గంటలు పడుతుంది. అయితే బుల్లెట్‌ ట్రైన్‌ అందుబాటులోకి వస్తే కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణ సమయం ఏకంగా 8 గంటలు మిగులుతుంది. చిత్తూరులో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ నిర్మాణానికి గుడిపాల మండలంలోని రైతులతో భూసేకరణ నిమిత్తం రైల్వే శాఖ అధికారులు గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. దీంతో చిత్తూరు ప్రజలకు బుల్లెట్‌ ట్రైన్‌ అందుబాటులోకి రానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..