AP Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..
AP Weather Alert: ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఉన్న వాయుగుండము పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి.. ఇవాళ ఉత్తర తమిళనాడు

AP Weather Alert: ఉత్తర తమిళనాడు తీరం వెంబడి ఉన్న వాయుగుండము పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి.. ఇవాళ ఉత్తర తమిళనాడు వద్ద 12.7 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.9 తూర్పు రేఖాంశం వద్ద, వెల్లూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం కొనసాగించి, తదుపరి 6 గంటలలో క్రమంగా తీవ్ర అల్ప పీడనంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తమిళనాడు మీద ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి అంతర్గత ఒడిశా వరకు, కోస్తాంధ్ర తీరం మీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రాలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే, ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కొన్నిచోట్ల కురిసే ఛాన్స్ ఉంది. ఇక భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఇక రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారు తెలిపారు.
Also read: