Indonesia Masters: క్వార్టర్స్‌ చేరిన పీవీ సింధు.. కేవలం 35 నిమిషాల్లో ప్రత్యర్థిని ఓడించిన భారత బ్యాడ్మింటన్ స్టార్

PV Sindhu: జపాన్‌కు చెందిన అకానె యమగుచి, థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావి చొచువాంగ్‌ల మధ్య జరిగే క్వార్టర్‌ఫైనల్ విజేతతో పీవీ సింధు సెమీ ఫైనల్‌లో తలపడనుంది.

Indonesia Masters: క్వార్టర్స్‌ చేరిన పీవీ సింధు.. కేవలం 35 నిమిషాల్లో ప్రత్యర్థిని ఓడించిన భారత బ్యాడ్మింటన్ స్టార్
Pv Sindhu
Follow us
Venkata Chari

|

Updated on: Nov 19, 2021 | 4:40 PM

Indonesia Masters: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుక్రవారం టర్కీ క్రీడాకారిణి నెస్లిన్ యిగిట్‌పై ఏకపక్ష విజయంతో సెమీస్‌లోకి ప్రవేశించింది. సింధు తన ప్రత్యర్థికి మ్యాచ్ మొత్తం ఆధిపత్యం చెలాయించే అవకాశం కూడా ఇవ్వకుండా గెలిచింది. వీరిద్దరి మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లోనే సాగగా, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ 21-13, 21-10తో విజయం సాధించింది.

ఈ టర్కీ ప్లేయర్‌తో ఇప్పటి వరకు నాలుగుసార్లు తలపడిన సింధు ప్రతిసారీ విజయం తన ఖాతాలో వేసుకుంది. గత నెలలో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో కూడా అతను భారత స్టార్ చేతిలో ఓడిపోయింది. ఇప్పటి వరకు టోర్నీలో సింధు బాట సాఫీగా సాగుతోంది. అయితే, సెమీస్‌లో ఆమెకు గట్టిపోటీ ఎదురవుతుంది. అక్కడ ఆమె జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచి, ఐదో సీడ్ పోర్న్‌పావీ చోచువాంగ్‌ల మధ్య మ్యాచ్ విజేతతో తలపడుతుంది. శుక్రవారం నాడు భారత్‌కు చెందిన ఇద్దరు స్టార్స్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడనున్నారు.

రెండో రౌండ్‌లో విజయం సాధించిన ప్రణయ్, శ్రీకాంత్.. గంటా 11 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్‌సెన్‌ను 14-21, 21-19, 21-16 తేడాతో ఓడించి ప్రణయ్ అద్భుతంగా రాణించాడు. మొదటి గేమ్‌లో ఓడిపోయిన తర్వాత, ప్రణయ్ ప్రపంచ నంబర్ టూ ప్లేయర్‌పై అద్భుతంగా పునరాగమనం చేసి చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేశాడు. అక్సెల్‌సెన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ప్రణయ్‌కి ఇదే తొలి విజయం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 32వ ర్యాంక్‌లో ఉన్న ప్రణయ్, మార్చి తర్వాత పూర్తి మ్యాచ్‌లో డెన్మార్క్ ఆటగాడిని ఓడించిన తొలి భారతీయుడు. గంటా రెండు నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ పురుషుల శ్రీకాంత్ 13-21, 21-18, 21-15తో ఇండోనేషియాకు చెందిన ఆరో సీడ్ జొనాథన్ క్రిస్టీపై విజయం సాధించాడు. ప్రస్తుతం సెమీఫైనల్ కోసం ఇద్దరు ఆటగాళ్లు తలపడనున్నారు.

డబుల్స్ విభాగంలో భారత్‌కు నిరాశే.. కఠినమైన రెండో రౌండ్ మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో కపిల, సిక్కి మూడు గేమ్‌లలో 15-21 23-21 18-21 థాయ్ జోడి సుపక్ జోమ్‌కో, సుపిసర ప్యూసంప్రాన్ చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, ఎన్‌ సిక్కి రెడ్డి జోడీ కూడా నిరాశపరిచింది. భారత జోడీని 18-21 12-21తో మూడో సీడ్ జోంగ్‌కోల్ఫాన్ కిటితార్కుల్, రవీంద ప్రజోంగ్‌జాయ్ వరుస గేమ్‌లలో ఓడించారు.

Also Read: Royal Challengers Bangalore: ఆర్‌సీబీ కెప్టెన్‌పై మరోసారి ఆసక్తికర చర్చ.. డివిలియర్స్ రిటైర్మెంట్‌తో తెరపైకి వచ్చిన వారెవరంటే?

AB de Villiers Retires: డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ భావోద్వేగం.. హృదయాలను గెలుచుకున్న టీమిండియా కెప్టెన్ ట్వీట్.!