AP Rain Alert: ఏపీ ప్రజలకు రెయిన్ అలెర్ట్.. మరో మూడు రోజులు ఆ ప్రాంతాల్లో వర్షాలు..
Andhra Pradesh Weather forecast: పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బిఆర్ అంబేద్కర్ తెలిపారు. మరో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం..
Andhra Pradesh Weather forecast: పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బిఆర్ అంబేద్కర్ తెలిపారు. మరో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వర్షాలతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండవద్దన్నారు. ఇంకా సామాన్య ప్రజలు, రైతులు వర్షం వేళల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే రాబోయే మూడు రోజుల వాతావరణ వివరాలు క్రిందివిధంగా ఉండనున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
రేపు (06-07-2023)
రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలిక పాటి వానలు పడడానికి అవకాశం ఉంది.
ఎల్లుండి (07-07-2023)
ఎల్లుండి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ,ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
శనివారం (08-07-2023)
శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లక్ చేయండి