Red notice to AP: ఏపీ సర్కార్ మరో షాక్.. రెడ్ నోటీస్ జారీ చేసిన మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ డివైజ్ ఫోరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెట్ విద్యా సంస్థలు, ఉద్యోగ సంఘాల ఇష్యూ పూర్తిగా సాల్వ్‌ కాకముందే, మరో అంశం తెరపైకి వచ్చింది. ఇందులో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా రెడ్‌ నోటీస్‌ పెట్టింది ఓ అసోషియేషన్.

Red notice to AP: ఏపీ సర్కార్ మరో షాక్.. రెడ్ నోటీస్ జారీ చేసిన  మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ డివైజ్ ఫోరం
Red Notice To Ap
Follow us

|

Updated on: Nov 13, 2021 | 5:47 PM

Red notice to AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెట్ విద్యా సంస్థలు, ఉద్యోగ సంఘాల ఇష్యూ పూర్తిగా సాల్వ్‌ కాకముందే, మరో అంశం తెరపైకి వచ్చింది. ఇందులో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా రెడ్‌ నోటీస్‌ పెట్టింది ఓ అసోషియేషన్. దీనిపై సీరియస్‌గా ఉన్న ఏపీ ప్రభుత్వం.. విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది సర్కారు.

ఆంధ్రప్రదేశ్‌లో రోజుకో అంశం వివాదాస్పదంగా మారుతోంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఉద్యోగ సంఘాల డెడ్‌లైన్, అమరావతి రైతుల మహా పాదయాత్ర వంటి విషయాలపై ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి ప్రతిపక్షాలు. తాజాగా మరో కీలక అంశం స్క్రీన్‌పైకి వచ్చింది. ఓ అసోషియేషన్ ప్రభుత్వ ప్రతిష్ఠనే దిగజార్చేలా రెడ్‌ నోటీస్‌ను ప్రయోగించింది. దీనిపై గుర్రుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రా డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌కు, మందుల స‌ర‌ఫ‌రాపై ఏఎంఈడీ రెడ్ నోటీస్ జారీ చేసింది. అసోసియేష‌న్ ఆఫ్ మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ డివైజ్ ఫోరం రెడ్ నోటీస్ జారీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఏపీ స‌ర్కార్. గత ఐదేళ్లుగా APMSIDC నుంచి పలు కంపెనీలకు బిల్లులు చెల్లించలేదనేది అసోసియేషన్ ఆరోపిస్తోంది. వీటిలో గత ప్రభుత్వంలో బకాయిలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మందులు, ఇతర ఎక్విప్‌మెంట్ సరఫరా చేయాలంటే, 100 శాతం అడ్వాన్స్ తీసుకోవాలని సూచించింది ఆ అసోషియేషన్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రెడ్ నోటీస్ జారీ చేసింది. అంతేకాకుండా తన అధికారిక వెబ్ సైట్‌లో పెట్టింది. అటు APMSIDCకి మెయిల్ పంపింది డివైజ్ అసోసియేషన్.

AMED రెడ్ నోటీస్‌పై సీరియస్ అయింది ఏపీ సర్కార్. నోటీస్‌లో చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవం అంటుంది ప్రభుత్వం. రెడ్ నోటీస్ జారీ వెనుక ఏదైనా దురుద్దేశం ఉండొచ్చని భావిస్తుంది సర్కారు. వాస్తవంగా వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో 2020 కోట్లు కంపెనీలకు చెల్లించగా, ఇంకా కేవలం 328 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. కోవిడ్ సమయంలో గతేడాది 856 కోట్లు, ఈ ఏడాది 551 కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. అయినప్పటికీ పెండింగ్ ఉన్నది కేవలం 328 కోట్లు అని చెప్పుకొస్తుంది ఏపీ సర్కార్. AMED రెడ్ నోటీస్ జారీపై విచారణ జరుగుతుందని, దురుద్దేశం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెబుతోంది ప్రభుత్వం.

డివైజ్‌ ఇండస్ట్రీ నుంచి ఓ మెయిల్‌ వచ్చిందని చెప్పారు రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ మురళీధర్‌రెడ్డి. 2014-2019 సంవత్సరాలకు సంబంధించి చాలా చిన్న మొత్తాలు చెల్లించాల్సి ఉందని వివరించారాయన. మొత్తంగా నాలుగైదు సంస్థలకు 15 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉందనన్నారు మురళీధర్‌రెడ్డి. సంబంధిత సంస్థల నుంచి ఎక్విప్‌మెంట్ ఆలస్యంగా పంపిణీ జరిగినా, క్వాలిటీ లేకున్నా, సంబంధిత పత్రాలు చూపించకున్నా, నిబంధనల ప్రకారం వ్యవహరించకున్నా చెల్లింపుల్లో కోతలు అనివార్యంగా ఉంటాయని స్పష్టం చేశారు ఎండీ. గడిచిన రెండు సంవత్సరాల్లో కొవిడ్‌ అవసరాలకు కొనుగోలు చేసిన ఉపకరణాల కోసం 18 వందల కోట్ల వరకు చెల్లించామని చెప్పారు మురళీధర్‌రెడ్డి.

AMED రెడ్ నోటీస్ పై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. నోటీస్ లో పేర్కొన్న విషయాలు పూర్తిగా అవాస్తవం అంటుంది ప్రభుత్వం. రెడ్ నోటీస్ జారీ వెనుక ఏదైనా దురుద్దేశం ఉండొచ్చని భావిస్తుంది ప్రభుత్వం. వాస్తవంగా జగన్ సర్కార్ వచ్చిన తర్వాత రెండున్నరేళ్లలో రూ.2020 కోట్లు కంపెనీలకు చెల్లించగా…ఇంకా కేవలం రూ.328 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో గతేడాది రూ.856 కోట్లు, ఈ ఏడాది రూ.551 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయినప్పటికీ పెండింగ్ ఉన్నది కేవలం రూ.328 కోట్లు అని చెప్పుకొస్తుంది సర్కార్. AMED రెడ్ నోటీస్ జారీ పై విచారణ జరుగుతుందని, దురుద్దేశం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సర్కార్ చెప్తుంది.

ఇప్పుడు ఏపీలో ఈ ఇష్యూ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రెడ్‌ నోటీసును అసోషియేషన్ వెబ్‌సైట్‌లో ఉంచడం ఇందుకు కారణమైంది. ఈ అసోసియేషన్‌లో వైద్య రంగానికిసంబంధించిన ఎక్విప్‌మెంట్, ఎలక్ట్రానిక్‌, డయాగ్నస్టిక్స్‌, ఇంప్లాంట్స్‌ వంటి వాటిని తయారుచేసే సంస్థలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈ అన్ని సంస్థల ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Also….  AP Local Body Elections: ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి నేటితో తెర.. 14,15, 16 తేదీల్లో పోలింగ్

Latest Articles
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే..
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?