Andhra Pradesh: ఈసారి తగ్గేదేలే.. ఏపీలో మళ్లీ రోడ్డెక్కిన టీచర్స్‌.. అప్పటివరకు డెడ్‌లైన్‌..

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పోరుబాట పట్టారు ఉపాధ్యాయులు. డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. పీఎఫ్, సరెండర్‌ లీవ్‌లు, మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు, LGLI సమస్యలను పరిష్కరించాలంటూ స్టేట్‌వైడ్‌గా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు.

Andhra Pradesh: ఈసారి తగ్గేదేలే.. ఏపీలో మళ్లీ రోడ్డెక్కిన టీచర్స్‌.. అప్పటివరకు డెడ్‌లైన్‌..
Ap Teachers

Updated on: Nov 23, 2022 | 8:11 AM

Andhra Pradesh teachers protest: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పోరుబాట పట్టారు ఉపాధ్యాయులు. డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కారు. పీఎఫ్, సరెండర్‌ లీవ్‌లు, మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు, LGLI సమస్యలను పరిష్కరించాలంటూ స్టేట్‌వైడ్‌గా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేపట్టిన ఉపాధ్యాయులు.. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ డబ్బు తమకివ్వమంటే ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. డీఏ, పీఎఫ్‌, సరెండర్‌ లీవ్స్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్‌ 30నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.

తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, తాము దాచుకున్న డబ్బులనే తిరిగివ్వాలని అడుగుతున్నామని అంటున్నారు. పీఎఫ్‌ లోన్స్‌కి అప్లైచేసి ఏడాదైనా మంజూరు చేయడం లేదంటున్నారు టీచర్స్‌. వారం రోజుల్లో బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారని, కానీ ఏ వారమో చెప్పటం లేదంటూ ప్రభుత్వ తీరుపై సెటైర్లు వేశారు. తమ జీతాల నుంచి కట్‌ చేసిన డబ్బును ఇవ్వమంటే ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు.

బకాయిలు చెల్లించకపోగా, కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు ఉపాధ్యాయులు. ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలంటున్నారు టీచర్స్‌. పాత పింఛన్‌ విధానాన్ని అమలుచేసి సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..