AP SSC Results: గెట్ రడీ స్టూడెంట్స్.. కాసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి.
ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 22వ తేదీ) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఫలితాల విడుదలకు ఈసీ నుంచి అనుమతులు లభించాయి. దీంతో 11 గంటలకు రిజల్ట్స్‌ను అధికారికంగా ప్రకటించానున్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని...

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్. మరికాసేపట్లో ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం ఈసారి త్వరగా పూర్తి చేశారు. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఈ దిశగా అడుగులు వేశారు.
ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 22వ తేదీ) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో ఫలితాల విడుదలకు ఈసీ నుంచి అనుమతులు లభించాయి. దీంతో 11 గంటలకు రిజల్ట్స్‌ను అధికారికంగా ప్రకటించానున్నారు. విజయవాడ ఎంజీ రోడ్డులోని తాజ్ వింటా హోటల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫలితాలు విడుదల చేయగానే వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అందరికంటే ముందు సులభమైన విధానంలో https://tv9telugu.com/లో తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా కూడా రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది సుమారు 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




