AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: మరో YSRCP ఎమ్మెల్యేపై స్థానిక నేతల తిరుగుబాటు బావుటా.. అనంతలో వేడెక్కిన రాజకీయం

Andhra Pradesh Politics: ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చాలా పవర్ ఫుల్.. తెలుగు దేశం పార్టీ(TDP) కంచుకోటలో సింగిల్ హ్యాండ్ తో గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేశారు.

AP Politics: మరో YSRCP ఎమ్మెల్యేపై స్థానిక నేతల తిరుగుబాటు బావుటా.. అనంతలో వేడెక్కిన రాజకీయం
YSRCP
Janardhan Veluru
|

Updated on: Jan 29, 2022 | 3:53 PM

Share

AP Politics: ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే చాలా పవర్ ఫుల్.. తెలుగు దేశం పార్టీ(TDP) కంచుకోటలో సింగిల్ హ్యాండ్ తో గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేశారు. అయితే ఎన్నికల ముందు వరకు ఒక లెక్క.. ఆ తరువాత మరో లెక్కగా మారింది అక్కడి పరిస్థితి. అప్పటి వరకు  సౌమ్యురాలినే చూశారు.. కానీ ఇంకో యాంగిల్ ని ఎమ్మెల్యే అయిన తరువాతనే చూశారు. ఆమెకు తెలియకుండా నియోజకవర్గంలో ఏం జరగకూడదంతే.. నిన్నటి వరకు ఇలా ఎమ్మెల్యేతో సఫర్ అయిన బ్యాచ్ అంతా ఒక్కటైపోయారు. ఎవరికైతే ఎమ్మెల్యేకి భయపడి ఇన్ని రోజులు నోరు విప్పకుండా మౌనంగా ఉన్నారో.. వారంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఫలితం.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో రాజకీయ రచ్చ తారస్థాయికి చేరిపోయింది. అనంతపురం జిల్లా(Anantapur District) అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)లో ఈ వ్యవహారం హిట్ టాపిక్‌గా మారిపోయింది.

ఉషా శ్రీ చరణ్… వైసీపీ మహిళా ఎమ్మెల్యేల్లో కాస్త స్ట్రాంగ్ లీడర్.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వంటి తెలుగుదేశం పార్టీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగురవేసిన మహిళా లీడర్. అయితే ఆమె గురించి చెప్పాలంటే ఎన్నికల ముందు వరకు ఒక లెక్క.. ఎన్నికల తరువాత మరో లెక్క అని చెప్పొచ్చు. 2019 ఎన్నికల ముందు ఉషా శ్రీ చరణ్ అంటే.. ఒక సౌమ్యురాలు.. ఎక్కడా కాంట్రవర్షీస్ లేవ్. కానీ ఎమ్మెల్యే అయ్యాక మాత్రం సీన్ మారింది. నియోజకవర్గంలో ఆమె ఏం చెబితే అదే వేదం.. అటు స్వపక్షం అయినా విపక్షం అయినా ఆమెకు ఎదురెళ్తే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. అయితే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడిన అధికార పార్టీ వారు.. ఎమ్మెల్యే తీరుతో కాస్త విబేధించారు. దీనికి తోడు ఎంపీ తలారీ రంగయ్యకు సన్నిహితంగా ఉన్న వారు కూడా ఉన్నారు. ఇది మెల్లగా ఒక గ్రూప్ గా మారింది. కానీ ఇన్ని రోజులు వారు తమ వ్యతిరేకతను బహిర్గతం చేయకుండా మౌనంగానే ఉన్నారు. అయితే నిన్నటి వరకు ఎమ్మెల్యేకి ప్రధానంగా అనుచరుడిగా ఉన్న శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ్ గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేకి దూరమవుతూ వచ్చారు.  ఫైనాన్షియల్ మ్యాటర్సే కాకుండా ఒక భూవివాదం దీనికి కారణంగా తెలుస్తోంది.

Kalyandurg MLA KV Ushasri Charan

Kalyandurg MLA KV Ushasri Charan (File Photo)

ఈ భూవివాదంలో వాస్తవంగా ఏం జరిగిందో తెలియదు కానీ.. ఎమ్మెల్యేతో మంజునాథ్‌కు బాగా గ్యాప్ వచ్చింది. దీంతో ఎమ్మెల్యే యాంటీ వర్గం అంతా ఒక్కటవుతూ వచ్చింది. దీనికి తోడు మున్సిపల్ ఛైర్మన్ వివాదం కూడా తోడైంది. గత ఏడాది మార్చిలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరిగితే… నిన్నటి వరకు ఛైర్మన్ ఛాంబర్ కి రాలేదంటే.. ఎమ్మెల్యేకి ఎదురు తిరిగితే సీన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. దాదాపు 10నెలల తరువాత ఛైర్మన్ రాజ్ కుమార్ మున్సిపల్ కార్యాలయంలో ఛాంబర్ లోకి రావడంతో యాంటీ గ్రూప్ మరింత స్ట్రాంగ్ అయింది. దీంతో ఒక్కసారి పరిణామాలు మారిపోయాయి. ఇదే సమయంలో కొందరు నేతలపై ఒత్తిళ్లు అధిక కావడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అనంతపురం వచ్చారు. అయితే చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. మరికొందరు ఎంపీ అవినాష్ రెడ్డిని కలసి నియోజకవర్గంలో తమ బాధల గురించి చెప్పుకున్నారు…

జిల్లాలో నేతలు కూడా ఎమ్మెల్యేని కాదని.. యాంటీ గ్రూప్ కి సహకరించే పరిస్థితి లేకపోవడంతో జడ్పీటీసీ మంజునాథ్ ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో వారికి సహకరించి గెలిపిస్తే.. ఇప్పుడు మన మీద పెత్తన చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో కలసిపోయి వారికే ప్రధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెత్తనం ఇక సహించేది లేదని నేతలు క్లారిటీగా డిసైడ్ అయ్యారు. అయితే దీనిపై ఎమ్మెల్యే ప్రెస్ మీట్ నిర్వహించాలని భావించారు. కానీ చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. కానీ మరుసటి రోజు సీన్ ఇంకో టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యే డైరెక్ట్ చేయలేదు కానీ… యాంటీ గ్రూప్ కి సారథ్యం వహిస్తున్న మంజునాథ్ కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టారు. దళితుల భూములు కాజేసి మోసం చేస్తున్న మంజునాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద టీ సర్కిల్ లో ఆందోళనకు దిగారు..

అయితే నిన్న వరకు కనిపించని ఎస్సీ, ఎస్టీ సంఘాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వెంటనే ఆందోళన చేయడం ఏంటని యాంటీ గ్రూప్ ప్రశ్నిస్తోంది. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసుని చెబుతున్నారు. ఎమ్మెల్యేకి ఎవరు ఎదురు తిరిగినా ఇలాంటివే వస్తాయని గరం గరం అవుతున్నారు. మొత్తం మీద కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే హవాకి యాంటీ గ్రూప్ భారీ స్పీడ్ బ్రేకర్ గా మారిపోయింది. ఈ వ్యవహారం అనంతపురం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అసలు ఈ గొడవలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో చూడాలి..

(లక్ష్మీకాంత్, టీవీ9 తెలుగు, అనంతపురం జిల్లా)

మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ రాజకీయ వార్తలు ఇక్కడ చదవండి.. 

Also Read..

Punjab Election 2022: ఒక ఒరలో రెండు కత్తులు.. పంజాబ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలుసా..?

AP 10th class Exams 2022: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుకు ఇక 6 రోజులే మిగిలున్నాయ్..