AP Ration Card: ఈకేవైసీ కోసం రేషన్ కార్డుదారుల తిప్పలు.. ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు..

AP Ration Card: రేషన్‌కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని కార్డుదారులంతా అవస్థలు పడుతున్నారు. వేకువజాము..

AP Ration Card: ఈకేవైసీ కోసం రేషన్ కార్డుదారుల తిప్పలు.. ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు..
Ration Card Holders
Follow us

|

Updated on: Aug 19, 2021 | 9:17 AM

AP Ration Card: రేషన్‌కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులంతా అవస్థలు పడుతున్నారు. వేకువజాము నుంచే పోస్టాఫీసులు, బ్యాంకుల్లోని ఆధార్‌కేంద్రాల వద్ద కుటుంబసభ్యులతో సహా బారులు తీరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కార్డుదారులు రావడంతో ఆధార్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే ఈకేవైసీ నమోదు కేంద్రాల వద్ద ఎలాంటి భౌతికదూరం లేకపోవడం గమనార్హం. నవీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఈనెల 25లోపు ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతుండటంతో అందరూ పరుగులు తీస్తున్నారు.

కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేయించుకోని పక్షంలో వచ్చే నెల నుంచి రేషన్‌ రాదని, అలాగే ప్రభుత్వం విద్యార్థులకు అందించే వివిధ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తారని ప్రచారం జరుగుతుండటంతో వందలాది మంది రేషన్‌ కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచి ఆధార్ కేంద్రం దగ్గర బారులు తీరుతున్నారు. అయితే క్యూ లైన్ లో నిలిచి ఉన్న కొద్ది మందికి మాత్రమే టోకెన్లు అందుతుండటంతో మిగిలిన వారు నిరాశతో తిరిగి వెళుతున్నారు.. మరిన్ని ఆధార్ సెంటర్‌లు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని కార్డుదారులు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆధార్‌ కార్డుతో ఎలక్ట్రానిక్‌ పద్ధతిన వినియోగదారుల రేషన్‌ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ) కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు. రేషన్ కార్డుల్లోని పేర్ల అనుసంధానం కోసం ఆధార్‌ సెంటర్లకు పోవాల్సిన పని లేదని, సమీపంలోని వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదిస్తే సరిపోతుందని తెలిపారు. వలంటీర్లను, వీఆర్వోలను సంప్రదించిన తర్వాతే ఆధార్‌ సెంటర్లకు వెళ్లాలని సలహా ఇచ్చారు. కొత్తగా ఆధార్‌ కార్డు కావాల్సిన వారు, ఇతరత్రా మార్పులు చేర్పులు చేయించుకోదలచిన వారు మాత్రమే ఆధార్‌ సెంటర్లకు వెళ్లాలన్నారు. ఎవరి రేషన్ కార్డులూ రద్దు కాబోవని, ఆధార్‌తో అనుసంధానం అయిన రోజు నుంచే బియ్యం తీసుకోవచ్చునని తెలిపారు.

Also read:

తాలిబన్ డార్క్ సీక్రెట్స్.. ఇరవై ఏళ్ల పాటు సాగిన ప్రజాపాలన అంతం..:Afghanistan Crisis Live video.

Anjali: అంజలికి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో తెలుగమ్మాయి.. ఏ సినిమా అంటే..

Varalakshmi Vratham: వరలక్ష్మి వత్ర విశిష్టత, పూజా విధానం.. తోరం కట్టుకునే పధ్ధతి తెలుసుకుందాం