AP Weather Report: రాగల 24 గంటల్లో ఏపీలో మరో అల్పపీడనం..! 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం..
AP Weather Report: IMD వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం
AP Weather Report: IMD వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఈ ప్రభావం వల్ల రాగల 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆ తీరం వెంబడి వేటకు వెళ్ళరాదని ఏపీ విపత్తుల శాఖ సూచించింది.
రాగల 4 రోజుల వాతావరణ సమాచారం: శనివారం(11-09-2021): శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
ఆదివారం(12-09-2021): శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
సోమవారం(13-09-2021): శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
మంగళవారం(14-09-2021): శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.