Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZP chairperson race: ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం.. జెడ్పీ ఛైర్మన్ రేసులో ప్రముఖుల బంధుగణం..!

ZP chairperson race: ఆంధ్రప్రదేశ్ పరిష‌త్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా వైసీపీ సొంతం చేసుకుంది.

ZP chairperson race: ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం..  జెడ్పీ ఛైర్మన్ రేసులో ప్రముఖుల బంధుగణం..!
Ysrcp
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 20, 2021 | 2:01 PM

ZP chairperson race: ఆంధ్రప్రదేశ్ పరిష‌త్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా వైసీపీ సొంతం చేసుకుంది. 13 జిల్లా పరిషత్‌లనూ వైసీపీ చేజిక్కించుకుంది. ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అభ్యర్ధుల భవితవ్యం కూడా తేలిపోయింది. ఇక, ఇప్పుడు జెడ్పీ చైర్మన్ల సందడి మొదలైంది. గెలిచిన ఆశావహులు అప్పుడే చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ పీఠం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. అయితే, ఫలితాల్లో అత్యధికంగా వైసీపీ అభ్యర్థులు గెలుపొందడంతో అమాంతం ఆశావహులు పెరగడంతో ఇప్పుడు జెడ్పీ పీఠంపై ఉత్కంఠ నెలకొంది.

విశాఖ జిల్లా లో జెడ్పీ చైర్ పర్సన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైర్ పర్సన్ పీఠం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. జిల్లాలో 652 ఎంపీటీసీ స్థానాలకు గానూ 612 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో గొలుగొండ ఎంపీటీసీ బ్యాలెట్‌ బాక్స్‌లో పత్రాలు తడిసిపోవడంతో ఆ ఫలితం వాయిదా పడింది. ఇక, మిగిలిన స్థానాల్లో వైసీపీ – 450, టీడీపీ – 118, బీజేపీ – 06, జనసేన – 02, సీపీఎం 03, సీపీఐ 02, ఇతరులు 28 స్థానాలను గెలుచుకున్నారు. ఇక.. జెడ్పీటీసీల విషయానికొస్తే.. 39 స్థానాలకు గాను 36 చోట్ల ఎన్నికలు జరిగాయి. వాటిలో 34 సీట్లతో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ, సీపీఎం చెరో ఒక్క జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఇక, ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. గెలిచిన అభ్యర్ధులు ఉత్సాహంగా ఉన్నారు. ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఇప్పుడు జెడ్పీ పీఠంపై ఎక్కేందుకు ఏజెన్సీలోని గిరిజన అభ్యర్ధులు ఆశావహులుగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే జీకే వీధి నుంచి గెలుపొందిన ఎస్తీ భగత సామాజిక వర్గానికి చెందిన శివరత్నం పేరు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. అయితే, ముంచంగిపుట్టు నుంచి గెలుపొందిన సుభద్ర పేరు కూడా చర్చలోకి వచ్చినట్లు సమాచారం. ఇక, ఈ రేసులో మూడో పేరు వెంకటలక్ష్మి. ఈమె జి మాడుగుల నుంచి గెలుపొందారు. వీరితో పాటు మరికొందరు అశావాహులు జేడ్పీ పీఠం కోసం అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ముగ్గురి పేర్లున్నా.. జీకే వీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం పేరు చైర్ పర్సన్ పీఠానికి ప్రధానంగా వినిపిస్తోంది. శివరత్నం భర్త విశ్వేశ్వరరాజు పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా ఆశించారు. అయితే, ఆ సమయంలో సమీకరణల్లో భాగంగా ఎమ్మెల్యే టికెట్ భాగ్యలలక్ష్మీకి దక్కింది. ఆమె అక్కడ గెలుపొందారు. అయితే.. తీవ్ర అసంతృప్తితో ఉన్న విశ్వేశ్వరరాజును అధిష్టానం న్యాయం చేస్తానని అప్పట్లో భరోసా ఇవ్వడంతో ఆయన మెత్తబడ్డారు. ఆ తరువాత జెడ్పీటీసీ ఎన్నికల్లో జీకే వీధి నుంచి భార్య శివరత్నంను పోటీ చేయించారు. అక్కడ ఆమె గెలుపొందారు. అయితే అధిష్టానం తమకు జెడ్పీ చైర్ పర్సన్ పీఠం ఇస్తుందని ధీమాతో ఉన్నారు.

ఇక మాజీ మంత్రి బాలరాజు కూడా తన కుమార్తె వెంకటలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నా.. పార్టీ పెద్దలతో ఆయన టచ్‌లోనే ఉన్నారు. ఈ నేపధ్యంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో జి మాడుగుల టికెట్ ను మాజీమంత్రి బాలరాజు కుమార్తె వెంకటలక్ష్కికి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా జెడ్పీ పీఠంపై తన కుమార్తెను కూర్చోబెట్టాలని మాజీ మంత్రి బాలరాజు విశ్వప్రయత్నాలు మొదలు పెట్టారు.

అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కిముడు శివరత్నం భర్త విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రి బాలరాజు దూరంగా ఉన్నారని, వారికి టికెట్ ఇవ్వడంపైనా స్థానిక ఎమ్మెల్యేలు అభ్యత్తరం చెప్పినా అధిష్టానం శివరత్నం, వెంకటలక్ష్మికి టికెట్ ఇచ్చారు. తాజా ఫలితాల్లో వాళ్లిద్దరూ గెలిచారు. అయితే.. వీరిలో కిముడు శివరత్నంకే జెడ్పీ చైర్ పర్సన్ పీఠం దాదాపు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యేలు.. ప్రత్యామ్నాయ పేరు తెరపైకి తెచ్చినట్టు చెబుతున్నారు. ముంచంగిపుట్టు జెడ్పీటీసీగా గెలుపొందిన సుభద్ర పేరు తెరపైకి వచ్చింది.

మరోవైపు బాలరాజు కూడా తన కుమార్తె కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. దాదాపుగా ఖరారైందని చెబుతున్న, విశ్వేశ్వరరాజు భార్య శివరత్నం వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మరి అదే జరుగుతుందా..? మాజీ మంత్రి బాలరాజు ప్రయత్నం ఫలిస్తుందా..? లేక స్థానిక ప్రజాప్రతినిధుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయా అన్న సందేహాలకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

అటు కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరికి అనే దానిపైనా ఉత్కంఠ నడుస్తోంది. కొలిమిగుండ్ల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన zptc ఎర్రబోతుల వెంకటరెడ్డి కి చైర్మన్ పదవి ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. గెలిచిన కొద్ది రోజులకే కరోనాతో మృతి చెందారు వెంకట్ రెడ్డి. దీంతో చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై సస్పెన్స్ నడుస్తోంది. సంజామల zptc వెంకటసుబ్బారెడ్డికి చైర్మన్ పదవి వరించే అవకాశం కనిపిస్తోంది. కొలిమిగుండ్ల నుంచి zptc ఉప ఎన్నికల్లో వెంకట్ రెడ్డి కొడుకు గెలిచిన తర్వాత ఈ ఛైర్మన్ పదవి కట్టబెడ్తారని అంటున్నారు స్థానిక వైసీపీ నాయకులు.

ఇక, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో అనంతపురం జిల్లా పార్టీలో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. జడ్పీ ఛైర్మన్ ఎవరన్న దానిపై ఉత్కంఠ చెలరేగుతోంది. ప్రధానంగా ముగ్గురు మహిళల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. దీంతో ఈ పంచాయితీ అధిష్టానం దగ్గరకు చేరింది. ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎంపిక పై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.

Read Also..  Garden On Car Roofs: కరోనా ఎఫెక్ట్..వాడకపోవడంతో పాడైన టాక్సీలు.. ఆదాయం కోసం రూఫ్ టాప్‌లపై కూరగాయల పెంపకం