Botsa: 80 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ లోగా లబ్ధిదారులకు అందిస్తాం: మంత్రి బొత్స సత్యనారాయణ
ఏ రోజైతే కోర్ట్ ఎన్నికల ఫలితాలు లెక్కించమని తీర్పు ఇచిందో అప్పటి నుంచి టీడీపీ ఆందోళన ఆక్రోశం చూస్తున్నామని
Botsa Satyanarayana – AP Minister – Chandrababu: ఏ రోజైతే కోర్ట్ ఎన్నికల ఫలితాలు లెక్కించమని తీర్పు ఇచిందో అప్పటి నుంచి టీడీపీ ఆందోళన ఆక్రోశం చూస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2019లో ప్రతిపక్ష నేతగా సమస్యలు తెలుసుకుని వాగ్దానాలు ఇచ్చారు.. ఇప్పుడు వాటిని పరిష్కరిస్తున్నారు అని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పనితీరుని చెప్పుకొచ్చారు బొత్స. ప్రజల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ అంటోంది.. ఎందుకొస్తుంది వ్యతిరేకత.. ప్రజలకు మేలు చేసినందుకా అంటూ ఆయన ప్రశ్నించారు.
“టీడీపీ పని అయిపోయింది.. చంద్రబాబుకి జవసత్వాలు లేవు. ఇది మేము చెప్తున్నది కాదు.. ప్రజలిచ్చిన తీర్పు. అందుకే వాళ్ళ భాష, తీరు మారిపోయింది. ప్రవర్తన ప్రజలు ఛీత్కరించుకునే విధంగా ఉండకూడదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనకు నిన్న వచ్చిన తీర్పు నిదర్శనం. ఎన్నికలు ఎప్పుడు బహిష్కరించాలి.. ప్రజల నాడి తెలిసిన తర్వాత కాదు ఇలాంటి కుతంత్రాలు చేయడం, తోక ముడుచుకుని మేము ఎప్పుడు వెళ్ళలేదు. అచ్చెన్నను రాజీనామా చేయమను.. నేను చేస్తాను.. ఇవేమన్నా కుస్తీ పోటీలా.” అంటూ బొత్స సత్యనారాయణ నిలదీశారు.
“ఓటమిని అంగీకరించాలి.. విశ్లేషణ చేసుకోవాలి. ప్రజలు అమాయకులు కాదు.. ఎవరేమి చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో క్రిమినల్ మైండ్ సెట్ ఒక్క చంద్రబాబుకే ఉంది. 60 లక్షల మంది గత ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ల లబ్ధిదారులకు శాశ్వత హక్కు ఇవ్వబోతున్నాం. 80 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ లోగా లబ్ధిదారులకు అందిస్తాం.” అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
Read also: Visakha: గంట కురిసిన వర్షానికే వాగులా మారిన సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ.. కొట్టుకుపోయిన వాహనాలు