AP Municipal and Corporation Election Winners 2026: ఏపీ మున్సిపల్ పోరు.. ఏకగ్రీవం అయిన అభ్యర్థులు వీరే
AP Local Body Polls 2026 Result : ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లలో ఉన్న మొత్తం 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం అవ్వగా 804 డివిజన్లలో కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 87 ఛైర్‌పర్సన్ స్థానాలు ఉండగా అందులో 17 స్థానాలు ఏకగీవం అయ్యాయి. తాజాగా జరుగుతున్న కౌటింగ్‌లో పెద్దాపురం మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్ 773 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 కార్పొరేషన్లలో ఉన్న మొత్తం 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం అవ్వగా 804 డివిజన్లలో కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 87 ఛైర్‌పర్సన్ స్థానాలు ఉండగా అందులో 17 స్థానాలు ఏకగీవం అయ్యాయి. వీటిలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో టీడీపీకి 15, జనసేన, బీజేపీలకు చెరొకటి ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 70 స్థానాలకు ఎన్నికలు జరగతా ప్రస్తుతం కౌటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,020 మున్సిపల్ వార్డు స్థానాలు ఉంగడా.. అందులో 637 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 2,382 వార్డులకు ఎన్నికలు జరగ్గా ఆయా వార్డుల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న కౌటింగ్‌లో ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యంగా పెద్దాపురం మున్సిపాలిటీలోని 3వ వార్డులో జనసేన అభ్యర్థి సతీశ్‌కుమార్ 773 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని ఏడో వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
AP Municipal Election 2026 Winners (ఏకగ్రీవాలు):
| మున్సిపాలిటీ పేరు | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
| పిడుగురాళ్ల | షేక్ బాబావలీ | టీడీపీ |
| గురజాల | నెలవల్లి బొల్లయ్య | టీడీపీ |
| దాచేపల్లి | తంగెళ్ల శ్రీనివాసరావు | టీడీపీ |
| కనిగిరి | అచ్చాల తిరుపతమ్మరెడ్డి | టీడీపీ |
| నగరి | ఇ.నారాయణ శ్రీనివాసన్ | టీడీపీ |
| పుంగనూరు | నయీం తాజ్ | టీడీపీ |
| రాయచోటి | బోనుమల ఖాదర్‌వలీ | టీడీపీ |
| రాజంపేట | దొంతం గాయత్రి | టీడీపీ |
| ప్రొద్దుటూరు | నంద్యాల రాఘవరెడ్డి | టీడీపీ |
| బద్వేలు | సోమేశుల దివ్యతేజ | టీడీపీ |
| మైదుకూరు | ధనపాల జగన్‌మోహన్ | టీడీపీ |
| కమలాపురం | గొంగల్‌రెడ్డి స్వప్న | టీడీపీ |
| గుత్తి | గోవిందరాజుల తమిళ్‌సెల్వి | టీడీపీ |
| ఆళ్లగడ్డ | షేక్ అనీషా | టీడీపీ |
| ఆత్మకూరు | డాక్టర్ ఆవుల గోవిందరాజులు | టీడీపీ |
| ఎర్రగుంట్ల | గొర్ల మధులత | బీజేపీ |
| దర్శి | దారం సుబ్బారావు | జనసేన |
