AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections Result LIVE Updates: కాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలిచేదవరో!

AP Local Body Polls 2026 Result Live Updates in Telugu: ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది.. ఇక కాసేపట్లో బరిలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు.

AP Local Body Elections Result LIVE Updates: కాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలిచేదవరో!
Ap Local Body Elections Result
Anand T
|

Updated on: Nov 03, 2026 | 7:21 AM

Share

LIVE NEWS & UPDATES

  • 03 Nov 2026 07:21 AM (IST)

    Repalle Election Counting: రేపల్లెలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఆలస్యం

    మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుఫాన్‌ ఎఫెక్ట్
    రేపల్లెలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఆలస్యం
    ఉ.10గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్న కలెక్టర్
    భారీ వర్షాల కారణంగా రేపల్లెలో కౌంటింగ్ ఆలస్యం
  • 03 Nov 2026 07:18 AM (IST)

    Cyclone Effect on Election Counting: కౌంటింగ్ పై తుఫాన్ ఎఫెక్ట్

    కౌంటింగ్ పై తుఫాన్ ఎఫెక్ట్

    విజయవాడలో దంచి కొడుతున్న వర్షం

    కౌంటింగ్ కేంద్రాలకు పూర్తిగా చేరుకుని సిబ్బంది

    మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన ఉన్న కౌంటింగ్

  • 03 Nov 2026 07:10 AM (IST)

    మరికాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

    ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

    రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల్లో కౌంటింగ్

    13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు

    మొత్తం 3,186 వార్డుల్లో ఓట్ల లెక్కింపు

    కౌంటింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల ఏర్పాటు

    మొత్తం 556 కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు

    ఓట్ల లెక్కింపు కోసం 6,831 టేబుళ్ల ఏర్పాటు

    కౌంటింగ్ విధుల్లో 47,817 మంది సిబ్బంది

    కౌంటింగ్ కేంద్రాల్లో 1,372 సీసీ కెమెరాలతో నిఘా

    మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 804 వార్డులకు కౌంటింగ్

    79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 2,382 వార్డులకు కౌంటింగ్

    కార్పొరేషన్ల కౌంటింగ్ కోసం 4,026 టేబుళ్లు

    మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కౌంటింగ్ కోసం 2,805 టేబుళ్లు

    కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

    ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న ఉత్కంఠభరితమైన ఓట్ల లెక్కిం

మరికాసేపట్లో ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేలబోతున్నాయ్. రీపోలింగ్‌ సెంటర్లతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపోరుకు సంబంధించిన ఫలితాలు మరికొన్ని నిమిషాల్లో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరోవైపు కౌంటింగ్‌ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని.. అటు అధికార కూటమి, ఇటు విపక్షం.. తమ నేతలను, శ్రేణులను అలెర్ట్‌ చేశాయి.

ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఉంటుంది. కౌంటింగ్ సెంటర్‌ లోపల, బయట సీసీ కెమెరాలు ఉంటాయి. పాస్‌లు ఉన్న ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ హాల్‌లోపలికి అనుమతి ఉంటుంది.

మొత్తం 92 పురపాలికల్లో పోలింగ్‌ జరగగా… ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో 556 కౌంటింగ్ హాల్స్.. 6 వేల 831 కౌంటింగ్ టేబుల్స్‌ను సిద్ధం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 6 వేల 831 మంది సూపర్‌వైజర్లు ఉంటారు. కౌంటింగ్ కోసం 13వేల 662 మంది సిబ్బంది ఉంటారు. ఓట్ల లెక్కింపులో 27 వేల 324 మంది అసిస్టెంట్లు పాల్గొంటారు.

ఇక 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం కాగా.. మున్సిపాలిటీల్లోని 3,020 వార్డులకు గానూ 637 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,382 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం స్థానాలకు 10వేల 262 మంది పోటీ చేశారు. వీరి భవితవ్యం కాసేపట్లో తేలనుంది.

రీ పోలింగ్ తర్వాత చూస్తే.. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్ నమోదైనట్టు SEC ప్రకటించింది. 96 లక్షల 89వేల 61 మంది ఓటర్లకు గాను 60లక్షల 22వేల 411 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం చూస్తే… పెద్ద నగరాల కంటే చిన్న మున్సిపాలిటీల్లోనే అధికంగా పోలింగ్ జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

రీపోలింగ్ ప్రకటించిన 13 కేంద్రాల్లోనూ ఆ ప్రక్రియ పూర్తయిపోవడంతో… వాటిలో కూడా కౌంటింగ్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అధికారులు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిల్లో కలిపి మొత్తం 2,805 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు… స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు అమర్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published On - Nov 03,2026 7:08 AM

Follow Us