Uravakonda: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. బాగా చూసుకుంటాడని.. తమ ఇంటి బంగారాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే..

పిల్లను ఇచ్చేముందు.. అబ్బాయి ఫారెన్‌లో ఉంటాడా..? సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తాడా..? లక్షల్లో జీతం వస్తుందా అని కాదు. అతడి గుణం చూడండి. గుణం మంచిదైతే రైతు కుటుంబంలో ఇచ్చినా.. దేవతలా చూసుకుంటారు.

Uravakonda: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. బాగా చూసుకుంటాడని.. తమ ఇంటి బంగారాన్ని ఇచ్చి పెళ్లి చేస్తే..
Women Dies Over dowry harassment
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 14, 2022 | 4:08 PM

అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. మంచి జీతం.. తమ కూతురు సుఖంగా బతుకుతుందని ఘనంగా పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. కానీ రెండేళ్లకే శిరీష కట్న వేధింపులకు బలైపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ CVV నగర్‌కు చెందిన వినోద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. బుక్కరాయసముద్రానికి చెందిన శిరీషతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వీళ్లకు ఏడాది వయసున్న ఓ కొడుకు ఉన్నాడు. పెళ్లి సమయంలో శిరీష తల్లిదండ్రులు 20 తులాల బంగారు, లక్ష నగదు ఇచ్చారు. 5సెంట్ల స్థలాన్ని శిరీష పేరుతో రాశారు.

ఆశ చావని వినోద్‌ కుటుంబం అదనపు కట్నం కోసం వేధించారు. అతనికి తల్లి సుజాత, అక్క భారతి, బావ ధనుంజయ, మేనమామ ప్రకాష్‌ తోడయ్యారు. అంతా కలిసి టార్చర్‌ పెట్టారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వేధింపులు భరించలేక ఇంట్లోనే ఉరేసుకుంది. భర్త ఆదివారం తెల్లవారుజామున గుర్తించి స్థానికుల సాయంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న శిరీష తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమ కుమార్తెను ఆమె భర్త, అత్తింటి వారి బంధువులే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. కూతురి పేరున ఉన్న ఐదు సెంట్ల భూమిని తన పేరు మీద రాయాలని వేధించాడంటున్నారు. బాధితురాలి సోదరుడు శివప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తతో పాటు మరో ముగ్గురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..