Andhra Pradesh: మిర్చి రైతులకు అలర్ట్.. ఇలా అమ్ముకుంటే అధిక ధర..

గుంటూరు మిర్చియార్డు ఏషియాలోనే పెద్దదనే పేరుంది. పోయిన సారి కంటే ఈ సారికి మరింత వ్యాపారం జరిగే అవకాశముందన్న ఆశాభావం వ్యక్తం చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్.

Andhra Pradesh: మిర్చి రైతులకు అలర్ట్.. ఇలా అమ్ముకుంటే అధిక ధర..
Today Mirchi Price
Follow us

|

Updated on: Feb 02, 2023 | 10:04 AM

మిర్చి రైతులకు గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. మిర్చి పంటను పండించిన రైతులు తమ పంటను మిర్చి యార్డ్‌లో అమ్ముకోవాలని సూచించారు. తద్వారా అధిక రాబడిని పొందవచ్చు అని పేర్కొన్నారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు మార్కెట్ యార్డ్ చైర్మన్. గుంటూరు మిర్చియార్డు ఏషియాలోనే పెద్దదనే పేరుంది. పోయిన సారి కంటే ఈ సారికి మరింత వ్యాపారం జరిగే అవకాశముందన్న ఆశాభావం వ్యక్తం చేశారు మార్కెట్ యార్డ్ చైర్మన్. రైతులకు కావల్సిన సకల సదుపాయాలు చేయడానికి సిద్ధం. వ్యాపారుల మధ్య సమస్యలుంటే.. కమిటీ దృష్టికి తీసుకురావాలంటున్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్.

ఈ ఏడాది మిర్చి దిగుబడి బాగుందని.. గతేడాది 8500 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందనీ. ఈ సారికిది పదివేల కోట్లకు చేరే అవకాశముందని అన్నారు మార్కెట్ యార్డ్ చైర్మన్. జనవరి నుంచే రోజూ లక్ష నుంచి లక్షన్నర బస్తాల మిర్చీ వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి.. రైతులు మిర్చిని యార్డుకు తరలించి అమ్ముకోవాలని సూచించారు. రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన ధర యార్డులోనే లభిస్తుందని అన్నారాయన. వచ్చే సోమవారం నుంచి యార్డులో రైతులకు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

మిర్చి బస్తాల రాక పెరిగితే.. రాత్రిళ్లు ఎలాంటి సమస్యలు రాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వీటితో పాటు యార్డులో సెక్యూరిటీ సైతం పెంచుతామని చెప్పారు. మిర్చి వ్యాపారి కిడ్నాప్ విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారనీ. కిడ్నాప్ చేసిన వారెవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. కోట్ల రూపాయల వ్యాపారం చేసే ప్రాంతంలో కిడ్నాప్ లాంటి వ్యవహరాలు సరికాదని సూచించారు. వ్యాపారుల మధ్య సమస్యలుంటే కమిటీ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారాయన.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..