TDP: రగులుతున్న పల్నాడు.. టీడీపీ నేతపై హత్యాయత్నం.. కాల్పుల్లో గాయపడిన బాలకోటిరెడ్డి
రొంపిచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్ధులు ఇంట్లోకి చొరబడి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. ప్రస్తుతం నరసరావుపేటలోని..

పల్నాడు జిల్లా ఆలవాలంలో ఫైరింగ్ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. రొంపిచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్ధులు ఇంట్లోకి చొరబడి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. ప్రస్తుతం నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలకొటిరెడ్డికి చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని.. వివరాలు సేకరించారు. పైరింగ్ జరిపిందెవరు.. ఎందుకు హత్యాయత్నం చేశారన్న కోణంలో ఆరాతీస్తున్నారు. మరోవైపు కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని టీడీపీ నేతలు పరామర్శించారు.
గతేడాది జులైలో అలవల నుంచి చిట్టిపోతుల వారి పాలెం మార్గంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన బాల కోటిరెడ్డిపై దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో వైద్యం తర్వాత కోలుకున్నారాయన. ఆ ఘటన మరువకముందే మరోసారి బాలకొట్టిరెడ్డిపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. అయితే అప్పుడు ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ చేసింది పమ్మి వెంకటేశ్వర్‌రెడ్డినేనని నిర్ధారణ అయింది.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు జరిగాయి. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు గన్‌తో కాల్చి జరిపింది వెంకటేశ్వరరెడ్డి అని అనుమానిస్తున్నారు. గాయాలపాలైన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్పాట్‌ని పరిశీలించారు. బాధితుడిని టీడీపీ నేతలు ఆసుపత్రిలో పరామర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం




