AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు..

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి APADC టెండర్లు పిలిచింది.

Andhra Pradesh: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు..
Greenfields Airports
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Mar 09, 2025 | 7:13 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాల్లో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APADC) టెండర్లు పిలిచింది.

టెండర్ల ప్రక్రియ ఇలా..

ఆన్‌లైన్ టెండర్ల దాఖలుకు మార్చి 21 వరకు గడువు

మార్చి 24న సాంకేతిక బిడ్‌లు, 27న ఫైనాన్షియల్ బిడ్‌లు తెరవనున్నారు

అమరావతి విమానాశ్రయం నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని కన్సల్టెన్సీ సంస్థే సూచించాలి

శ్రీకాకుళంలో ఎక్కడ ఎయిర్‌పోర్ట్?

శ్రీకాకుళం జిల్లాలో నిర్మించబోయే విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో, శ్రీకాకుళం నగరానికి 70 కి.మీ. దూరంలో, సముద్రతీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలోనూ కేంద్ర బృందం సభ్యులు మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో భూములను పరిశీలించారు.

కన్సల్టెన్సీ సంస్థలు ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణను ప్రభావితం చేసే సాంకేతిక, ఆర్థిక అంశాలను గుర్తించాలి. పర్యావరణ మరియు సామాజిక ప్రభావ అధ్యయనాలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా వాటిదే.

ప్రాజెక్ట్ ప్రణాళిక

విమానాశ్రయాల నిర్మాణానికి కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్, ఫైనాన్షియల్ మోడల్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్లను సిద్ధం చేయాలి

ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP), జాయింట్ వెంచర్ వంటి విధానాల్లో ఏ మోడల్ అనుసరించాలనే అంశాలను విశ్లేషించాలి

నిర్మాణ వ్యయ అంచనా, రెవెన్యూ జనరేషన్ మోడల్స్ సిద్ధం చేయాలి

మార్కెట్ డిమాండ్ సర్వే

విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్ హబ్‌లుగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని ఏపీఏడీసీ సూచించింది. అలాగే, వైమానిక మరియు రక్షణ రంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను విశ్లేషించాలి.

35 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక

రాబోయే 35 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలి.

రన్‌వేలు, ట్యాక్సీవేలు ఎన్ని ఉండాలి, అవి ఎంత పొడవుండాలి అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలి.

ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ స్టాండ్లు, ప్యాసింజర్, కార్గో టెర్మినళ్ల రూపకల్పన వంటి అంశాలను ప్రణాళికలో పొందుపరచాలి.

నాన్-ఏవియేషన్ రెవెన్యూ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.

తొలగనున్న విమానయాన అంతరాలు

ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌లు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలు మరింత విస్తరించి, వాణిజ్య, పరిశ్రమలకు పెరుగుదల తథ్యం. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రానికి అంతర్జాతీయ విమానయాన రంగంలో ప్రముఖస్థానం దక్కే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..