AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagababu: చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..? మొత్తం ఆస్తుల వివరాలివే..

మెగా బ్రదర్స్ అన్నా, తమ్ముళ్ల మధ్య మధ్యమవాది అయిన కొణిదెల నాగబాబు మరోసారి వార్తల్లోకి వచ్చారు. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు. మెగా బ్రదర్‌గా సినీ, టీవీ రంగాల్లో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన తన ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించారు.

Nagababu: చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..? మొత్తం ఆస్తుల వివరాలివే..
Nagababu Chiranjeevi Pawan Kalyan
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Mar 09, 2025 | 8:53 AM

Share

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. అయితే.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. 70 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిన నాగబాబు.. తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని స్పష్టం చేశారు. అయితే.. మెగా ఫ్యామిలీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చించే అభిమానులకు నాగబాబు అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు, అప్పులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.. దీనిలో చిరంజీవి, పవన్ దగ్గర నాగబాబు అప్పు తీసుకున్నట్టు ప్రకటించడం మరింత ఆసక్తి రేపింది.

చరాస్తుల విలువ 59 కోట్లు

నాగబాబు దగ్గర బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు – రూ.55.37 కోట్లు

చేతిలో నగదు – రూ.21.81 లక్షలు

బ్యాంకు నిల్వలు – రూ.23.53 లక్షలు

ఇతరులకు ఇచ్చిన అప్పులు – రూ.1.03 కోట్లు

బెంజ్ కారు –రూ.67.28 లక్షలు

హ్యుందాయ్ కారు – రూ.11.04 లక్షలు

బంగారం & వెండి – రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు)

హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులు

నాగబాబు కు హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి – రూ.5.3 కోట్లు

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరాల భూమి – రూ.82.80 లక్షలు

రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి – రూ.53.50 లక్షలు

హైదరాబాద్ మణికొండలో విల్లా – రూ.2.88 కోట్లు

మొత్తం స్థిరాస్తుల విలువ – రూ.11.20 కోట్లు

మెగా బ్రదర్స్‌కు అప్పులు!

అఫిడవిట్‌లోని ఆసక్తికర అంశాల్లో ఒకటి అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ దగ్గర అప్పులు తీసుకున్న విషయం..

చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు

పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు ప్రకటించారు.

ఇదే కాకుండా, బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7.54 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!