AP PRC: చర్చలకు నో.. సమ్మెకే సై. PRC సాధనకు తగ్గేదేలే అంటున్న ఉద్యోగ సంఘాలు!

చర్చల కోసం మంత్రుల కమిటీ పంపిన ఆహ్వానాన్ని ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా తిరస్కరించాయి. అటు ప్రభుత్వ ఉద్యోగుల సవరించిన వేతన స్కేళ్లపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

AP PRC: చర్చలకు నో.. సమ్మెకే  సై. PRC సాధనకు తగ్గేదేలే అంటున్న ఉద్యోగ సంఘాలు!
Prc
Follow us

|

Updated on: Jan 24, 2022 | 8:06 AM

Andhra Pradesh Govt.Employees PRC: రండి.. మాట్లాడుకుందాం అంటోంది ప్రభుత్వం..! ముందు ఆ జీవోలు రద్దు చేయండి ఆ తర్వాతే ఏదైనా అంటున్నారు ఉద్యోగులు.! చివరికి సమ్మె వైపే మొగ్గు చూపింది PRC సాధన సమితి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు CSకు నోటీసులు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అటు ట్రెజరీ ఉద్యోగులు సహకరించకపోయినా…కొత్త జీతాలే చెల్లించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

చర్చలకు నో.. సమ్మెకే సై. PRC సాధన విషయంలో తగ్గేదే లే అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. చర్చల కోసం మంత్రుల కమిటీ పంపిన ఆహ్వానాన్ని ఏకగ్రీవంగా తిరస్కరించాయి. జీవోలు రద్దు చేయండి.. ఆ తర్వాతే సంప్రదింపులంటూ PRC సాధన సమితి సమావేశంలో తీర్మానం చేశారు. ముందుగా నిర్ణయించినట్లుగానే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు CSకు సమ్మె నోటీస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

ఇక ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకుప్రతి జిల్లాకు జేఏసీ తరపున ఓ రాష్ట్రస్థాయి నేతను పంపాలని నిర్ణయించారు. వీళ్లు జిల్లాల్లో జరిగిన ఉద్యమంపై ప్రతి రోజు నివేదిక ఇస్తారు. PDF MLCలను కూడా కలుపుకొని ఉద్యమం ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. అలాగే విమర్శలను తిప్పికొట్టేందుకు..8 మందితో ఓ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.అయితే మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ స్టీరింగ్‌ కమిటీని ఆహ్వానించిన జీఏడీ కార్యదర్శి శశిభూషన్. మెజార్టీ సభ్యులు…చర్చల ప్రతిపాదనను వ్యతిరేకించారు..అటు ఉద్యమానికి మరింత మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది PRC సాధన సమితి.

మరోవైపు, సమ్మెలోకి ఆర్టీసీతోపాటు..హెల్త్ డిపార్ట్‌మెంట్‌ను తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇక 11వ పీఆర్సీ ప్రకారం పే రోల్ రెడీ చేసేది లేదని ట్రెజరీ ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జీతాలు చెల్లించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. CFMS పోర్టల్‌లో ప్రత్యేక సాప్ట్‌వేర్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. బయోమెట్రిక్ మాడ్యూల్స్ తొలగించి.. అధికారుల సాయంతో కొత్త జీతాలు వేసేందుకు రెడీ అవుతోంది. CFMS సీఈవోకు అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలని సూచించింది ప్రభుత్వం.

ఇవాళ హైకోర్టులో విచారణ ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 17న జిఓ ఎంఎస్ నెం. 1 ద్వారా నోటిఫై చేసిన 2022 నాటి ప్రభుత్వ ఉద్యోగుల సవరించిన వేతన స్కేళ్లపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉద్యోగుల PRC జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై కోర్టులో పిటిషన్ వేశారు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్ లో పేర్కొన్నారు. సెక్షన్ 78(1) కి విరుద్ధంగా ఉన్న జీవో 1 ని రద్దు చేసేలా అదేశాలివ్వాలని కోరారు పిటిషనర్. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను చేర్చారు.

అంతేకాకుండా, సవరించిన పే స్కేలు జూలై 1, 2018 నుండి అమల్లోకి వచ్చేలా నిర్ణయించారని పేర్కొన్నారు. అదే నోటిఫికేషన్‌లో అసంబద్ధమైన నిబంధనను అందించారని, దానికి విరుద్ధంగా చేసిన వేతన స్థిరీకరణలను తిరిగి పొందుతామని పిటిషనర్ కోరారు. ఇది పరిపాలనా, ఉపాధి, కార్మిక చట్టాల స్థిర సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. PRC సిఫార్సులు,సెక్రటరీల కమిటీ ఫలితాలు విశ్లేషించలేదని, వాటిని కనీసం ఉద్యోగులకు వెల్లడించలేదని కృష్ణయ్య పేర్కొన్నారు. కృష్ణయ్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ విచారణకు లిస్ట్ చేసింది. ఇవాళ న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, బీఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Read Also… Arunachal Tunnel: అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్‌.. కీలక దశకు బోర్డర్‌ సెక్యూరిటీ ప్రాజెక్ట్!