విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం బంపరాఫర్.. రూ. కోటీకిపైగా ఆర్థిక సాయం, విదేశాల్లో చదువుకునే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది.పేదరికం పేరుతో విద్యకు దూరం కాకుండా ఉండేలా అనేక పథకాలు అమలు చేస్తోంది. అమ్మఒడి మొదలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందుబాటులోకి తీసుకొచ్చింది...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది.పేదరికం పేరుతో విద్యకు దూరం కాకుండా ఉండేలా అనేక పథకాలు అమలు చేస్తోంది. అమ్మఒడి మొదలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలతో పాటు ఈబీసీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్దేశిత సమయంలో ఫీజులు చెల్లిస్తుంది ప్రభుత్వం. దీనికి తోడు జగనన్న విదేశీ విద్యా దీవెన పధకం ద్వారా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు గరిష్టంగా కోటీ 25 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. ప్రతి ఏటా రెండుసార్లు ఈ పధకం కింద విద్యార్థులకు నిధులు విడుదల చేస్తోంది.
వరల్డ్ టాప్ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థులకు అవకాశం
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించే ఏపీకి చెందిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్ధులకు కోటీ 25లక్షల వరకూ ఇతర విద్యార్ధులకు కోటి రూపాయల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం అందిస్తుంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజినీరింగ్,మెడిసిన్ తో పాటు మొత్తం 21 కోర్సులకు సంబంధించి టాప్ 50 ర్యాంకులు సాధించిన 321 యూనివర్సిటీలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ పధకం వర్తింపచేస్తుంది. ఫీజు రీయింబర్స్ మెంట్‌తో పాటు వీసా ఖర్చులు, ఫ్లయిట్ టిక్కెట్స్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
జగనన్న విదేశీ విద్యా దీవెన పొందటం ఎలా?
ఏటా రెండు సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లను సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది.నాలుగున్వాయిదాల్లో స్కాలర్ షిప్స్ మంజూరు చేస్తుంది ప్రభుత్వం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన తర్వాత మొదటి వాయిదా, ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ తర్వాత రెండో వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత మూడో వాయిదా, 4వ సెమిస్టర్ పూర్తి చేసి మార్క్ షీట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్ లోడ్ చేసిన తర్వాత చివరి వాయిదా చెల్లించనుంది. అయితే కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలకు మించకూడదు. పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఈ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..