AP Govt: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. అవినీతి ఉద్యోగుల గుండెల్లో గుబులు.. దొరికితే ఇక అంతే..
ACB Cases: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల ఏసీబీ రైడ్స్‌లో చాలామంది ఉద్యోగులు పట్టుబడుతున్న

ACB Cases: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇటీవల ఏసీబీ రైడ్స్‌లో చాలామంది ఉద్యోగులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఉద్యోగులపై వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పక్కా ఆధారాలతో దొరికిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 100 రోజులు దాటితే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయంటూ ప్రభుత్వం వెల్లడించింది. ఏసీబీ డీజీ, శాఖల ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉద్యోగులపై 1995 నుంచి 2020 వరకు మొత్తం 1,686 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిలో 476 అవినీతి కేసులే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
కాగా.. అవినీతి కేసుల్లో ఎప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో ఎక్కువమంది ఉద్యోగులు సస్పెన్షన్‌లో ఉంటున్నారు. ఇలా వారు సుదీర్ఘ కాలం పాటు సస్పెన్షన్‌లో ఉంటూ.. సగం జీతాలు పొందుతున్నారు. అలాంటి వారిపై సత్వర చర్యలు లేకపోవడంతోనే అవినీతి మరింత పెరిగిపోతోందని ఏసీబీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు అవినీతి కేసుల పరిష్కారం కోసం.. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కాల పరిమితిని సవరించింది.
అవినీతికి పాల్పడిన అధికారి నేరుగా దొరికితే 24గంటల్లోపు అరెస్టు చేస్తారు. ఏసీబీ కోర్టు వెంటనే ఏపీవీసీకి సమాచారం ఇస్తారు. వెంటనే సంబంధిత శాఖ రెండు రోజుల్లోపు సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఏసీబీ అధికారులు ఆయా శాఖలకు 30 రోజుల్లోపు తుది నివేదిక అందించాలి. ఇలా అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల కేసులను 100 రోజుల్లో పరిష్కరించేలా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదలచేసింది.
Also Read:
