Andhra Pradesh: హెల్త్ అలవెన్సులు యథాతథం.. సమ్మె విరమించండి.. మున్సిపల్ కార్మికులకు మంత్రి సురేశ్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల ఆందోళనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య అలవెన్సులు యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. కార్మికుల హెల్త్ అలవెన్సు రూ.6 వేలను అలాగే ఉంచాలని సీఎం....
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల ఆందోళనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆరోగ్య అలవెన్సులు యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. కార్మికుల హెల్త్ అలవెన్సు రూ.6 వేలను అలాగే ఉంచాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. హెల్త్ అలవెన్సుతో కలిపి రూ.21వేలు వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్లు పరిష్కరించినందున సమ్మె విరమించాలని కోరారు. సీఎంతో (CM Jagan) సమావేశానికి ముందు రాష్ట్రంలోని మున్సిపాలిటీ కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మె కారణంగా చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలపై ఆరా తీశారు. చెత్త పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా పనులు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు.. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ మున్సిపాల్టీ కార్మికులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు నాలుగో రోజుకు చేరాయి.
హిందూపురం లోమున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది.. చెవిలో పూలు పెట్టుకొని నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై భోజనాలు చేశారు. నంద్యాలలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో వారి హెల్త్ అలవెన్సులను యథాతథంగా ఉంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి