AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రతీఒక్కరికీ రూ.20 వేలు.. రెడీగా ఉండండి..

ఏపీ ప్రభుత్వం ప్రతీ ఏటా మత్స్యకారులకు రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా వీటిని అందిస్తోంది. చేపల వేట విరామం సమయంలో వారికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు సాయం అందిస్తోంది. ఈ ఏడాది నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రతీఒక్కరికీ రూ.20 వేలు.. రెడీగా ఉండండి..
Money
Venkatrao Lella
|

Updated on: Apr 11, 2026 | 12:14 PM

Share

ఏపీలోని మత్స్యకారులకు చేపల వేట నిషేధం సమయంలో ప్రతీ ఏడాది రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా అమలవుతోంది. చంద్రబాబు సర్కార్ మత్స్యకారుల సేవలో పథకం పేరుతో దీనిని అమలు చేస్తోంది. గత ఏడాదిలో అర్హులకు అందించగా.. ఈ ఏడాదికి నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి లబ్దిదారుల ఎంపికను షురూ చేశారు. ప్రస్తుతం అర్హులైనవారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అర్హుల వివరాలను సేకరించి లబ్దిదారుల జాబితా సిద్దం చేయనున్నారు. అనంతరం వారి అకౌంట్లలో ప్రభుత్వం నిధులు వేయనుంది.

చేపల వేటపై నిషేధం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి రానుందని తెలిపింది. జూన్14వ తేదీ వరకు మొత్తం 61 రోజుల పాటు నిషేధం అమల్లోకి ఉండదనుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు సముద్రంలో చేపల వృద్ది జరుగుతూ ఉంటుంది. గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో బోట్లు తిరగడం వల్ల సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది. దీని వల్ల ప్రతీ ఏడాది ఈ సమయంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అదే నిర్ణయం తీసుకుంది.

రూ.10 లక్షలకు పెంపు

నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళితే బోటు రిజిస్ట్రేషన్ ఏడాది రద్దు చేస్తారు. అలాగే చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయని మత్స్యశాఖ తెలిపింది. మత్స్యకారులు దీనికి సహకరించాలని కోరింది. ఈ విరామ సమయంలో ప్రభుత్వం వారికి రూ.20 వేల ఆర్ధిక సాయం అందించనుంది. త్వరలో ఈ నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమయ్యే అవకాశముంది. అటు మత్స్యకారుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగగా ప్రమాద బీమా అందిస్తోంది. గతంలో బీమా లిమిట్ రూ.2 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచారు. చేపల వేటకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందుతుంది. ఇక సహజ మరణం పొందితే రూ.2 లక్షల పరిహారం అందుతుంది.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర