AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెల్స్‌ తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్
Andhra New Excise Policy
Ram Naramaneni
|

Updated on: Sep 25, 2024 | 9:09 AM

Share

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధం అవుతోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటుంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసింది. అయితే తాజాగా వైసీపీ తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కెబినెట్ ఆమోదించింది. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్సును ఆమోదించనున్నారు గవర్నర్. ఇక ఏపీలో మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశం పైనా అబ్కారీ శాఖ కసరత్తు చేస్తుంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో.. ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తుంది. ఆయా వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ.. కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది.

మరోవైపు ఏపీలో అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానం తీసుకురానున్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గీత కార్మికులకు మద్యం షాపులు కేటాయిస్తామని తెలిపింది. వారికి 10 శాతం మద్యం షాపులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని ఇటీవల మంత్రిమండలి నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!