Andhra News: అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ..అసలు విషయం ఏంటంటే?
ఏపీ డీజీపీ ద్వారకా తిరులమలరావు గుంటూరులోనే ఆయన పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుండి ఐపీఎస్ అయ్యేంత వరకూ ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్యను గుంటూరులోనే అభ్యసించారు. డీజీపీ అయిన తర్వాత ఆయన అనేకసార్లు గుంటూరులో పర్యటించారు కూడా.. అయితే ఆయన నిన్నటి పర్యటన మాత్రం ప్రత్యేకం అంటూ ఆయన స్నేహితులు చెప్పుకుంటున్నారు.
ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వంతూరు గుంటూరే… గుంటూరులోనే ఆయన పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుండి ఐపీఎస్ అయ్యేంత వరకూ ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్యను గుంటూరులోనే అభ్యసించారు. డీజీపీ అయిన తర్వాత ఆయన అనేకసార్లు గుంటూరులో పర్యటించారు కూడా.. అయితే ఆయన నిన్నటి పర్యటన మాత్రం ప్రత్యేకం అంటూ ఆయన స్నేహితులు చెప్పుకుంటున్నారు.
డీజీపీ ద్వారక తిరుమల రావు క్రిష్ణనగర్‌లోని మున్సిపల్ పాఠశాలలో ఒకటి నుండి ఐదో తరగతి వరకూ చదువుకున్నారు. ఇప్పటికీ ఆ పాఠశాల నడుస్తూనే ఉంది. దీంతో ఆయనతో పాటు చదువకుని హోమియో వైద్యుడిగా పనిచేస్తున్న ఓవి రమణ ఇతర స్నేహతుల సూచన మేరకు ఆయన మున్సిపల్ పాఠశాలకు వచ్చారు. తాను చదువుకున్న చిన్నప్పటి పాఠశాల ప్రస్తుత పరిస్థితిని ప్రత్యక్షంగా స్నేహితులతో కలిసి తిలకించారు. ఆనాటి అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని తన పేరు చూసుకొని మురిసిపోయారు. స్నేహితులతో కలిసి ఆనాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. బడి గంట కొట్టగానే ఇంటికి వెళితే ఏం నేర్చుకున్నావని ప్రతిరోజూ అమ్మే అడిగేదని ఆయన స్నేహితులకు చెప్పారు.
అనంతరం విద్యార్ధులతో మాట్లాడి విలువైన సూచనలు చేశారు. సెల్ ఫోన్‌కు దూరంగా ఉంటూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా కష్టపడి చదవాలన్నారు. సమయ పాలన పాటించాలన్నారు. క్రమశిక్షణ జీవితంలో ఎంతో అవసరమని ఉన్నత శిఖరాలకు చేరుకున్నా తమ మూలాలు మరిచి పోకూడదన్నారు. డీజీపీ తన చిన్ననాడు చదువకున్న స్కూలుకు రావడంతో అటు టీచర్లు, ఇటు విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి