AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అమ్మో.. భారీగా పెరిగిన ఏపీ అప్పులు.. రాష్ట్ర అప్పు ఎంతో తెలుసా?!

ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి. ఏపీ అప్పుల కుప్పగా మారిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్..

Andhra Pradesh: అమ్మో.. భారీగా పెరిగిన ఏపీ అప్పులు.. రాష్ట్ర అప్పు ఎంతో తెలుసా?!
Andhra Pradesh
Shiva Prajapati
|

Updated on: Feb 08, 2023 | 6:30 AM

Share

ఆంధ్రప్రదేశ్ అప్పులపై రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి. ఏపీ అప్పుల కుప్పగా మారిందని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2019తో పోలిస్తే ప్రస్తుతం ఏపీ అప్పులు దాదాపు రెండింతలయ్యాయని చెప్పారు. ఏపీ అప్పుల భారం ఏటేటా పెరుగుతోందన్నారు. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 4,42,442 లక్షల కోట్లు అని చెప్పారు పంకజ్ చౌదురి. 2019లో అప్పు రూ. 2,64,451 లక్షల కోట్లు ఉండగా.. 2020లో రూ. 3,7,671 లక్షల కోట్లు, 2021లో రూ. 3,53,21 లక్షల కోట్లు, 2022 లో రూ. 3,93,718 లక్షల కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 4,42,442 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ఇక బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఏపీ చేస్తున్న అప్పులు అదనమని చెప్పారు కేంద్ర మంత్రి.

ఇదిలా ఉంటే రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాలు మరింతగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లకు చేరిందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏటేటా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగి పోతున్నా.. కొత్త అప్పుల కోసం వైసీపీ సర్కారు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జనవరి నుంచి మార్చి కాలానికి రూ. 12 వేల కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆర్బీఐకి అప్పుల కేలండర్‌ పంపింది. జనవరిలో రూ. 7 వేల కోట్లు, ఫిబ్రవరిలో రూ. 4 వేల కోట్లను, మార్చిలో రూ. వెయ్యి కోట్లు తీసుకుంటామని తెలిపింది.

2018 లో కేంద్రం సవరించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు GSDPలో 20 శాతం మించకూడదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఉండాల్సిన పరిమితి కంటే 55 శాతం ఎక్కువగా ఉన్నాయి. చెల్లించాల్సిన బిల్లులతో కలిపి గత ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఏపీ ప్రభుత్వ అప్పులు రూ. 1.4 లక్షల కోట్లకు చేరినా.. కొత్త అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..