AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధాని ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన సైబర్ మోసగాళ్లు.. అప్రమత్తంగా ఉండాలన్న శ్రావణ్ కుమార్

ఏపిలో ప్రభుత్వం మారింది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాజధాని ఎమ్మెల్యేనే టార్గె చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అమరావతే తిరిగి రాజధాని అన్న స్పష్టత ఏపిలో వచ్చింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా వ్యహరిస్తుంది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాల్లు

రాజధాని ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన సైబర్ మోసగాళ్లు.. అప్రమత్తంగా ఉండాలన్న శ్రావణ్ కుమార్
Mla Shravan Kumar
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 20, 2024 | 4:03 PM

Share

ఏపిలో ప్రభుత్వం మారింది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాజధాని ఎమ్మెల్యేనే టార్గె చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో అమరావతే తిరిగి రాజధాని అన్న స్పష్టత ఏపిలో వచ్చింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా వ్యహరిస్తుంది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాల్లు అమరావతిపై కన్నేసినట్లు తెలుస్తుంది. టిడిపికి చెందిన తెనాలి శ్రావణ్ కుమార్ తాడి కొండ నియోజకవర్గం నుండి ముప్పై వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. 2014లోనూ టిడిపి అభ్యర్ధిగా విజయం సాధించిన శ్రావణ్ కుమార్ ప్రస్తుతం గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన పేరు మీద నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి ఆయన స్నేహితులకు డబ్బులు కావాలంటూ మెస్సెజ్ లు పంపారు. 25000 వేల రూపాయలు కావాంటూ ఎమ్మెల్యే శ్రావణ్ స్నేహితుడికి మెస్సెజ్ వచ్చింది.

అంతే కాదు సాయంత్రానికి డబ్బులు తిరిగి ఇస్తానంటూ కూడా చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్నేహితుడు వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే ద్రుష్టికి తీసుకెళ్లాడు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే శ్రావణ్ వెంటన్ ఈ విషయాన్ని ఖండిస్తూ పోస్ట్ లు పెట్టారు. స్థానికులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు వలలో చిక్కుకోవద్దని ఆయన సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. రాజధాని వాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us