CM Chandrababu: ఇదే దేవుడి స్క్రిప్ట్.. అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలో ఐదేళ్లుగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. కనీసం 70 నుంచి 80శాతం పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజారాజధానిపై అనేక కుట్రలు, విషప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటించారు. రాజధాని ప్రాంతాన్ని చుట్టేసిన చంద్రబాబు.. అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కూలిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు రాజధాని టూర్ మొదలు కాగా.. అక్కడ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించిన సీఎం.. అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. రాయపూడిలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ ,నిర్మాణదశలో ఉన్న భవనాలు.. నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు. హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జి క్వార్టర్స్ బిల్డింగులను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం, విధ్వంసం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలో ఐదేళ్లుగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. కనీసం 70 నుంచి 80శాతం పనులు జరిగిన భవనాలను కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజారాజధానిపై అనేక కుట్రలు, విషప్రచారాలు చేసి బ్రాండ్ దెబ్బతినేలా గత ప్రభుత్వం ప్రవర్తించిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అమరావతి రైతులు 1631 రోజులు పోరాటం చేశారని.. ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అంటూ పేర్కొన్నారు.
ఏపీలో A అంటే అమరావతి.. Pఅంటే పోలవరం అని.. అమరావతి, పోలవరమే ప్రాధాన్యతగా గతంలో తాము పనిచేశామంటూ సీఎం చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని.. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ఏం చేస్తాడో ఐదేళ్లు మనం చూశామన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం పాలన ప్రారంభించింది.. భవిష్యత్ తరాల కోసం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తా అంటూ పేర్కొన్నారు.
వీడియో చూడండి..
5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా.. అమరావతి అంటే సంపద సృష్టించే కేంద్రం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిపై ఎన్నో కుట్రలు, విషప్రచారం చేశారని.. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడిందన్నారు. సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులకు దక్కుతుందన్నారు. రైతులు 1631 రోజులు పోరాటం చేశారని.. 1+6+3+1 =11, వైసీపీకి 11 సీట్లే వచ్చాయి.. ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ చంద్రబాబు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
