AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఆ జిల్లాల్లో మాత్రం కనిపించని తీవ్రత..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా.. కరోనా వ్యాప్తి తగ్గడంలేదు. కొన్ని జిల్లాల్లో కేసుల తీవ్రత తగ్గినా.. మరికొన్ని జిల్లాల్లో కేసులు మాత్రం పెరుగుతున్నాయి.

AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఆ జిల్లాల్లో మాత్రం కనిపించని తీవ్రత..!
Ap Covid Cases
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 28, 2021 | 7:04 PM

Andhra Pradesh Coronavirus Today: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా.. కరోనా వ్యాప్తి తగ్గడంలేదు. కొన్ని జిల్లాల్లో కేసుల తీవ్రత తగ్గినా.. మరికొన్ని జిల్లాల్లో కేసులు మాత్రం పెరుగుతున్నాయి. కొత్తగా రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే 470 పాజిటివ్ కేసులు అదనంగా రికార్డ్ అయ్యాయి. కాగా, కొత్తగా 24 గంటల్లో కరోనాను జయించలేక 20 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,695 శాంపుల్స్‌ను పరీక్షించగా 2,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942కి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 1,956 మంది డిశ్చార్జ్ అవగా.. ఇప్పటివరకు 19,25,631 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,999గా ఉంది. కరోనా బారిన పడి ఇవాళ చనిపోయిన 20 మందితో కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 13,312 మంది ప్రాణాలను కోల్పోయారు.

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 70, చిత్తూరు జిల్లాలో 220, తూర్పుగోదావరి జిల్లాలో 386, గుంటూరు జిల్లాలో 175, కడప జిల్లాలో 142, కృష్ణాజిల్లాలో 293, కర్నూలు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 206, ప్రకాశం జిల్లాలో 216, శ్రీకాకుళం జిల్లాలో 46, విశాఖపట్నం జిల్లాలో 120, విజయనగరం జిల్లాలో 25, పశ్చిమగోదావరి జిల్లాలో 106 పాజిటివ్ కేసులు మోదయ్యాయి. కాగా, ఇప్పటివరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,43,24,626 నమూనాలను పరిక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక, వివిధ జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…