AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా బాధితులు.. తాజాగా రాష్ట్రంలో ఎన్నికేసులంటే..

Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య గతేడాది..

AP Corona Cases Updates: ఆంధ్రప్రదేశ్‌లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా బాధితులు.. తాజాగా రాష్ట్రంలో ఎన్నికేసులంటే..
Ap Corona Cases
Follow us

|

Updated on: Apr 11, 2021 | 5:34 PM

Andhra Pradesh Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌లో ఉంది. రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య గతేడాది కంటే అధికంగా నమోదు అవుతున్నాయి. నెల క్రితం వందల సంఖ్యలోనే నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు వేలకు చేరింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 31,719 సాంపిల్స్ పరీక్షించగా.. 3,495 మందికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. వీరిలో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా.. మరికొందరు హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా కారణంగా ఒక్క రోజులు తొమ్మిది మంది చనిపోయారు. చనిపోయిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు బాధితులుండగా.. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున బాధితులు ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 1,198 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,954 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,25,401 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 8,97,147 మంది కరోనాను జయించారు. ఇదే సమయంలో 7,300 మంది బాధితులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలాఉంటే తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. ఈ జిల్లాలో ఒక్కరోజులోనే గరిష్టంగా 719 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. గుంటూరులో 501 కేసులు నమోదు అయ్యాయి. ఇక విశాఖపట్నంలో 405, కృష్ణా జిల్లాలో 306, శ్రీకాకుళంలో 293, ప్రకాశం 215, అనంతపురంలో 209 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇదిలాఉంటే.. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,339  పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Also read:

IPL 2021: కోల్‌కతా – హైదరాబాద్ మధ్య ధూమ్ 3..! గెలుపు ఎవరిని వరిస్తుంది..? ఎవరి రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

Maharashtra Threat: తెలంగాణకు ‘మహా’ ముప్పు.. రాకపోకలపై నిఘా లేదు.. బోర్డర్‌లో పరీక్షలు అంతంత మాత్రమే

Power Cut to Police Station: మాస్క్ ధరించలేదని ఫైన్ వేసిన పోలీస్.. గంటలోపే ఊహించని షాక్ ఇచ్చిన విద్యుత్ ఉద్యోగులు..

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!