అనుమానంతో భార్యను కత్తితో పొడిచిన భర్త.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరదలునూ వదలని క్రూరుడు!
అనుమానం పెనుభూతం. అది విచక్షణ చంపేస్తుంది. ఒక్కోసారి మనిషిని మృగాన్ని చేస్తుంది. ముఖ్యంగా దంపతుల మద్య అనుమానం చొరబడిందో ఇక ఆ ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినట్టే.
అనుమానం పెనుభూతం. అది విచక్షణ చంపేస్తుంది. ఒక్కోసారి మనిషిని మృగాన్ని చేస్తుంది. ముఖ్యంగా దంపతుల మద్య అనుమానం చొరబడిందో ఇక ఆ ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినట్టే. మానసిక క్షోభతో దంపతులు ఇద్దరూ తల్లడిల్లాల్సిందే. అదిగో అలా అనుమానానికి అవకాశం చిక్కింది ఓ దంపతుల మధ్యలో.. ఆ భర్తకి భార్యపై అనుమానం వచ్చింది. అది తీరలేదు. సరికదా మరింత పెరిగింది. అంతే.. అతనిలోని మృగం తలెత్తుకుని బయటకు వచ్చింది. ఇంకేముంది భార్యను పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
కడప పట్టణం రవీంద్రనగర్ లో బీబీజాన్ తన భర్తతో కలసి ఉంటోంది. వారితో పాటు వారి మరదలు కూడా అక్కడే ఉంటోంది. కొన్నిరోజులుగా బీబీజాన్ భర్త ఆమె అనుమానం పెంచుకున్నాడు. అది తీరకపోగా రోజు రోజుకూ ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం అతను తన భార్య బీబీజాన్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయి ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమెను కత్తితో పొడుస్తున్న సమయంలో బీబీజాన్ చెల్లి.. అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కోపం వచ్చిన నిందితుడు మరదలు గౌసియాపై కూడా కత్తితో దాడి చేశాడు. ఇరుగూపొరుగు ఈ హడావుడి చూసి పోలీసులకు ఫోన్ చేశారు., దీంతో పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన గౌసియాను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది.. గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..