AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: బీ కేర్‌ ఫుల్‌ తమ్ముళ్లు..! గీత దాటితే మంత్రి పదవి ఉండదు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

బీ కేర్‌ ఫుల్‌ తమ్ముళ్లు...! లైన్ క్రాస్‌ చేశారో ఇక దబిడిదిబిడే..! సబ్జెక్ట్‌ నేర్చుకోండి.. సబ్జెక్ట్‌పైనే రాజకీయాలు చేయండి..! కాదుకాడదూ ఇష్టం వచ్చింది మాట్లాడతాం, నచ్చినట్లు చేస్తాం.. అనంటే ఇక రోజులు లెక్కపెట్టుకోండని మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

Chandrababu: బీ కేర్‌ ఫుల్‌ తమ్ముళ్లు..! గీత దాటితే మంత్రి పదవి ఉండదు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
Cm Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2025 | 8:33 PM

Share

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను హెచ్చరించారు.. అభివృద్దే లక్ష్యం.. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. గీత దాటి ఎవరైనా మాట్లాడితే నెక్ట్స్‌ డే మంత్రి పదవి ఉండదన్నారు. వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మంత్రులదేనన్న చంద్రబాబు… అలా చేయని వాళ్లు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు రెస్పాన్స్‌ సరిగా లేకున్నా కొత్తవాళ్లకు చాన్స్‌ ఇస్తామన్నారు. గతంలో రాజకీయాలు సబ్జెక్ట్‌ ఆధారంగా నడిచేవి కానీ ఇప్పడు ఆ పరిస్థితి లేదన్నారు. విపక్షాలు దుష్ప్రచారాలను సమర్ధవంతంగా తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు.

వాయిస్ః రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాడుతా.. ఎంత దూరమైనా వెళ్తానని మంత్రులకు చెప్పారు చంద్రబాబు. 30 ఏళ్ల కింద రౌడీలనే రప్ఫాడించా.. ఇప్పుడున్న వాళ్ల ఓ లెక్క కాదన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రిమినల్స్‌కి భయం పోయిందని.. భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. ఇకపై 1995 సీఎంని చూస్తారన్నారు. అంతేకాదు.. మహిళలపైన వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు చంద్రబాబు. అలాగే కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇవ్వాలన్నారు.

ఏపీలోని మామిడి రైతులకు గుడ్ న్యూస్..

ఇలాఉంటే.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మామిడి రైతులతో పాటు రాజధానికి వాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అమరావతి క్వాంటం వ్యాలీపైనా చర్చింది. జలవనరుల పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం కేబినెట్‌ నిర్ణయాలను వివరించారు మంత్రి పార్ధసారధి. తోతాపురి మామిడి రైతులకు రూ.260 కోట్లు రిలీజ్ చేసింది.. మామిడి రైతులందరిరీ కిలోకి రూ.4 చొప్పున చెల్లించనుంది. సీఆర్డీఏ భూకేటాయింపులపై చర్చించిన కేబినెట్.. నిర్మాణంలోని ప్రజాప్రతినిధుల క్వార్టర్స్‌కు నిధులు విడుదలచేసేందుకు నిర్ణయం తీసుకుంది. రూ.524 కోట్లు కేటాయించింది. అమరావతిలో వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌ సెంటర్‌, అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ఆమోదం, అనకాపల్లి నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్.. AMNSI ఏర్పాటుకు భూమార్పిడి, ప్రోత్సాహకాలు, ఏపీ జల్‌జీవన్‌ కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..