AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే

నైరుతి రుతు పవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2025 | 6:18 PM

Share

నైరుతి రుతు పవనాలు, అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అక్కడక్కడ భారీ వర్షాలతోపాటు.. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతం నుండి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మరియు దాని పరిసర ప్రాంతాలలో నున్నఅల్పపీడన సంభందిత ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ గుజరాత్ ప్రాంతం, ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 7.6 కి.మీ మధ్య ద్రోణి విస్తరించి ఉన్నది.

పశ్చిమ అస్సాం నుండి తెలంగాణ వరకు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్‌లోని, దాని పరిసర ప్రాంతాలలో నున్న అల్పపీడన సంభందిత ఉపరితల ఆవర్తనం, జార్ఖండ్, ఒడిశా అంతర్గత ప్రాంతం, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలమీదుగా ఒక ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి /పశ్చిమ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా – ఆంధ్రప్రదేశ్:-

బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-

బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 -50కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. శక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది .

తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉత్తర తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..