ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..ఉద్యోగుల సంక్షేమం, రోడ్ల విస్తరణ, నీటి ప్రాజెక్టులకు ఆమోదం
అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్‌తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్ లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు మున్సిపల్ శాఖలో చేపట్టే 506 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది.

అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్‌తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్ లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు మున్సిపల్ శాఖలో చేపట్టే 506 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో రహదారుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం, విద్యా రంగం, జైళ్ల సంస్కరణలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధానిలో కొత్తగా నిర్మించబోయే లోక్ భవన్‌తో పాటు అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్ లు, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణాలకు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేశారు.
అలాగే, మున్సిపల్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 9.500 కోట్లతో చేపట్టే 506 ప్రాజెక్టులకు పాలనా అనుమతులు ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారి 16పై భారీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తాడేపల్లి వరకు 3.8 కిలోమీటర్ల పొడవున ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ఎల్1 బిడ్‌ను ఆమోదించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువ రూ.532 కోట్ల 57 లక్షలుగా నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని పలార్ నదిపై ఉన్న చెక్‌డ్యామ్ మరమ్మతులు, పునర్నిర్మాణ పనుల కోసం సవరించిన పరిపాలనా ఆమోదాన్ని కేబినెట్ మంజూరు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ రెండు విడతల DA మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 3.64 శాతం చొప్పున DA చెల్లించనున్నారు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని 417 పోస్టులను అప్‌గ్రేడ్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించే క్రమంలో వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది. అమరావతిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా తీర్మానించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




