AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఎమ్మెల్యే కారును ఆపిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లా లో వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జివి.ఆంజనేయులు పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు ఆపారు.. తర్వాత పరిశీలించి చూస్తే పోలీసులు నిర్ఝాంతపోయారు.. కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదని తేలింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు

Andhra: ఎమ్మెల్యే కారును ఆపిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Mla Car
Fairoz Baig
| Edited By: |

Updated on: Dec 11, 2025 | 8:47 PM

Share

ప్రకాశం జిల్లా లో వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జివి.ఆంజనేయులు పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు ఆపారు.. తర్వాత పరిశీలించి చూస్తే పోలీసులు నిర్ఝాంతపోయారు.. కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదని తేలింది. వివరాల ప్రకారం.. కారుకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్టిక్కర్ను తగిలించుకుని టోల్‌గేట్‌ల వద్ద సిబ్బంది ని బురిడీ కొట్టిస్తూ… టోల్ చలనాలు చెల్లించకుండా దర్జాగా తిరుగుతున్న మున్వర్ అనే వ్యక్తి ని యర్రగొండపాలెం పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం ప్రాంతానికి చెందిన మున్వర్ గతంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వద్ద కారు డ్రైవర్ గా ఉన్నాడు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ పై పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జివి.ఆంజనేయులు పేరుతో నకిలీ స్టిక్కర్ చేయించి అంటించాడు.

అదేవిధంగా తన ఇతియాస్ కారు నెంబర్ ప్లేట్ లోని D అనే అక్షరం కనపడకుండా బ్లూ కలర్ స్టిక్కర్ అంటించి జాతీయ రహదారి పై ఉండే టోల్ గేట్స్ తోపాటు ఫారెస్ట్ టోల్ గేట్స్ వద్ద చలనాలు చెల్లించకుండా కారును అద్దెకు తిప్పుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారి పై ఉన్న మిల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా మున్వర్ తన కారుతో అక్కడకు వచ్చాడు. నెంబర్ ప్లేట్ పై అనుమానం కలిగిన ఎస్సై చౌడయ్య ఆరా తీస్తుండగా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును ఆపుతారా అంటూ మున్వర్ నిర్లక్ష్యం గా వ్యవహరించాడు.

దీంతో కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా నకిలీది కావడంతో మున్వర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది పోలీస్, ప్రెస్, ఎమ్మెల్యే, వివిధ గవర్నమెంట్ లోగోలతో వారికి సంబంధం లేక పోయినా వాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపారు.. ఇలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత
తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?
తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'ఫంకీ'..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'ఫంకీ'..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా..?
హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా..?