AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో యావరేజ్ టాక్.. ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 గా తెలుగు సినిమా

కొన్ని రోజుల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. చాలా చోట్ల నెగెటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఈ తెలుగు సినిమా ఇప్పుడు టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది.

OTT Movie: థియేటర్లలో యావరేజ్ టాక్.. ఇప్పుడు ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 గా తెలుగు సినిమా
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 9:31 PM

Share

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు, ఓటీటీ రిజల్ట్స్ రెండు వేరు వేరుగా ఉంటాయి. థియేటర్లలో బాగా ఆడిన సినిమాలు ఒక్కోసారి ఓటీటీలో పెద్దగా ఆడవు. అలాగే థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలు ఒక్కోసారి ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంటాయి. అలా ఇప్పుడు ఓ తెలుగు సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. పేరున్న హీరో నటించినప్పటికీ పెద్దగా ఆడలేదు. దీంతో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఓ మోస్తరు వసూళ్లతో మాత్రమే సరిపెట్టుకుంది. చివరికి ఐఎమ్‌డీబీలోనూ ఈ మూవీ పదికి 5 రేటింగ్ మాత్రమే సాధించుకుంది అదే సినిమా గత వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రాగా ఇప్పుడు టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో హీరో ఓ జూనియర్‌ లెక్చరర్‌. కానీ అతనికి జాతకాలు, మూడనమ్మకాలటే పిచ్చి. అందుకే 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉంటాడు. అలాంటిది అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది లెక్చరర్‌ మనీషా. మొదట పట్టించుకోకపోయినా హీరో కూడా ఆమెను ఇష్టపడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ కూడా అవుతారు. అయితే ఇంతలో మనీషా ఓ షాకింగ్ నిజం చెబుతుంది. దీంతో వీరిద్దరి జీవితాలు అనుకోని మలుపు తిరుగుతాయి. మరి మనీషా చెప్పిన ఆ నిజమేంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమానే విష్ణు విన్యాసం. నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, సత్యం రాజేష్, గోపరాజు రమణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుమంత్ నాయుడు నిర్మించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అప్పటి నుంచే ట్రెండింగ్ లో దూసుకుపోతోందీ సినిమా. ఇండియా వైడ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని మూవీస్‌లో అన్నింటిలో కెల్లా విష్ణు విన్యాసం సినిమానే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో విష్ణు విన్యాసం సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల